Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp: తెలియని నెంబర్ల నుంచి వాట్సాప్‌ కాల్స్‌ వస్తున్నాయా.? లిఫ్ట్‌ చేశారో ఇక అంతే..

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొంగొత్త మార్గాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ మోసమో మరోసారి వెలుగు చూసింది. ఈసారి సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ను తమ మోసానికి వారధిగా వాడుకుంటున్నారు....

Whatsapp: తెలియని నెంబర్ల నుంచి వాట్సాప్‌ కాల్స్‌ వస్తున్నాయా.? లిఫ్ట్‌ చేశారో ఇక అంతే..
Whatsapp Calls
Follow us
Narender Vaitla

|

Updated on: May 05, 2023 | 3:10 PM

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొంగొత్త మార్గాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ మోసమో మరోసారి వెలుగు చూసింది. ఈసారి సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ను తమ మోసానికి వారధిగా వాడుకుంటున్నారు. ఇటీవలి కాలంలో చాలా మందికి తెలియని నెంబర్ల నుంచి వాట్సాప్‌ కాల్స్‌ వస్తున్నాయి. అవికూడా ఇతర దేశాలకు చెందిన కోడ్‌తో వస్తున్నాయి.

ఈ ఫేక్‌ కాల్స్‌ ద్వారా కొంత మంది యూజర్లను టార్గె్ట్‌ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వాయిస్‌ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెంబర్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఇతర దేశాల నుంచి ఫోన్‌ వస్తున్నట్లు భ్రమ కలిగిస్తున్నారు. ఇలా ఫోన్‌ కాల్స్‌ చేసి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పని ఉందంటూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. కేవలం వెబ్‌సైట్స్‌ క్లిక్‌ చేస్తే డబ్బులు వస్తాయంటూ ఆశ చూపుతూ యూజర్లను నిండా ముంచుతున్నారు. కాబట్టి ఇలాంటి ఫోన్‌ కాల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది యూజర్లు తమకు ఇలాంటి అన్ నోన్ నెంబర్స్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ ట్విట్టర్ వేదికగా స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇలాంటి మోసాల బారిన పడకూడదంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ను లిఫ్ట్‌ చేయకూడదని సూచిస్తున్నారు. ఎవరైనా మోసం చేస్తున్నట్లు ఏమాత్రం అనిపించినా వెంటనే దగ్గర్లో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. లైక్‌ చేస్తే డబ్బులు ఇస్తారంటూ జరుగుతోన్న ప్రచారాల్లో ఏమాత్రం నిజం లేదని గుర్తించాలి. ఇప్పటికే చాలా మంది ఈ ఊబిలో పడిపోయి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా జరిగాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

లూసిఫర్ 2 తెలుగులోనే చూడండి..హీరో పృథ్వీరాజ్ సుకుమారన్..
లూసిఫర్ 2 తెలుగులోనే చూడండి..హీరో పృథ్వీరాజ్ సుకుమారన్..
గురుదేవ్ శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌‌తో డ్యుయోలాగ్‌ విత్‌ బరుణ్‌దాస్‌
గురుదేవ్ శ్రీశ్రీశ్రీ రవిశంకర్‌‌తో డ్యుయోలాగ్‌ విత్‌ బరుణ్‌దాస్‌
అట్లీ డైరెక్షన్‏లో అల్లు అర్జున్ సినిమా.. బన్నీ రెమ్యునరేషన్ షాక్
అట్లీ డైరెక్షన్‏లో అల్లు అర్జున్ సినిమా.. బన్నీ రెమ్యునరేషన్ షాక్
శని, శుక్రుల అరుదైన కలయిక.. ఆ రాశుల వారికి సిరిసంపదలు..!
శని, శుక్రుల అరుదైన కలయిక.. ఆ రాశుల వారికి సిరిసంపదలు..!
క్యాన్సర్‌పై పోరాడిన శివన్న పెద్దమ్మతల్లి ఆశీస్సులతో షూటింగ్‌కు..
క్యాన్సర్‌పై పోరాడిన శివన్న పెద్దమ్మతల్లి ఆశీస్సులతో షూటింగ్‌కు..
ఆ నింగిలో చంద్రునికి జాబిల్లికి ఈ సుకుమారి.. చార్మింగ్ ఐశ్వర్య..
ఆ నింగిలో చంద్రునికి జాబిల్లికి ఈ సుకుమారి.. చార్మింగ్ ఐశ్వర్య..
కూతురు సితారతో మహేష్ బాబు కొత్త యాడ్..
కూతురు సితారతో మహేష్ బాబు కొత్త యాడ్..
హలీం లాగించేస్తున్నారా? తలకాయ కూర తెగ తినేస్తున్నారా?
హలీం లాగించేస్తున్నారా? తలకాయ కూర తెగ తినేస్తున్నారా?
వేప నూనెతో మెరిసే అందం.. పట్టులాంటి చర్మం కోసం ఇలా ట్రై చేయండి…
వేప నూనెతో మెరిసే అందం.. పట్టులాంటి చర్మం కోసం ఇలా ట్రై చేయండి…
జీడిపప్పు తినడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు..!
జీడిపప్పు తినడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు..!