- Telugu News Photo Gallery Technology photos Huge discount on smartphone in amazon great summer sale 2023
Amazon Sale: స్మార్ట్‌ఫోన్ కొనే వారికి పండగే.. అమెజాన్ సేల్‌లో ఈ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్
ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కైంట్స్‌ను అందిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌పై గతంలో ఎన్నడూ లేని విధంగా డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్స్‌పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఓ లుక్కేయండి..
Updated on: May 05, 2023 | 6:43 PM

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. దీంతో పాటు ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.

నోకియా ఎక్స్30 5జీపై రూ.13 వేల డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. 48,999 కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 35,999కే సొంతం చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.28 వేలకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు.

సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 11 ఆర్ 5జీ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా రూ. 25 వేలు డిస్కౌంట్ పొందో అవకాశం ఉంది. 8జీబీ రామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.39,999 కాగా ఆఫర్ కింద రూ.38,999లకు కొనుగోలు చేయొచ్చు. పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ కింద రూ.25 వేల వరకు రాయితీ పొందవచ్చు. ఈ ఫోన్‌లో 6.74 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ + కర్వ్‌డ్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

రియల్ మీ నార్జో ఎన్55 అసలు ధర రూ.10,999 కాగా, అమెజాన్ సమ్మర్ సేల్స్ కింద రూ.10,249 ధరకు అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.10,300 ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. మీడియా టెక్ హెలియో జీ88 ఎస్వోసీ చిప్ సెట్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 33 వాట్ల సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను అందించారు.

రెడ్ మీ 12 సీ స్మార్ట్ ఫోన్‌ను అన్ని బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ. 8499కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రూ.8400 వరకు రాయితీ పొందొచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.13,999గా ఉంది.

సేల్‌లో డిస్కౌంట్ లభిస్తోన్న మరో స్మార్ట్ ఫోన్ వివో వై56 5జీ. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.19,999కాగా ఆఫర్‌లో భాగంగా రూ.18,999లకు లభిస్తుంది. పాత ఫోన్ ఎక్స్చేంజ్ కింద రూ.18,750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.





























