AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp New Feature: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్‌.. ఇక గూగుల్‌ డ్రైవ్‌తో పనేలేదు.. పూర్తి వివరాలు..

రెండు మూడు డివైజెస్‌ లలో వాట్సాప్‌ వినియోగించేటప్పుడు వాట్సాప్ సాధారణంగా గూగుల్‌పై ఆధారపడుతుంది. ఇప్పుడు గూగుల్‌ సపోర్ట్‌ లేకుండానే వివిధ డివైజ్‌లలో మీ చాట్‌లు ఓపెన్‌ అయ్యే విధంగా కొత్త అప్‌ డేట్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

WhatsApp New Feature: వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్‌.. ఇక గూగుల్‌ డ్రైవ్‌తో పనేలేదు.. పూర్తి వివరాలు..
Whatsapp
Madhu
|

Updated on: May 02, 2023 | 1:30 PM

Share

మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కొత్త ఫీచర్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. వినియోగదారుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటిని అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలోనే సరికొత్త అప్‌డేట్లను ఇటీవల అందించింది. వాటిల్లో ఒకే వాట్సాప్‌ అకౌంట్‌ను నాలుగు డివైజ్‌లలో వినియోగించుకొనే వెసులుబాటు, డిస్‌ అప్పిరింగ్‌ మెసేజ్‌లను సేవ్‌ చేసుకోవడం వంటివి ఉన్నాయి. ఇప్పుడు మరో అద్భుతమైన ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. అదేంటంటే రెండు మూడు డివైజెస్‌ లలో వాట్సాప్‌ వినియోగించేటప్పుడు వాట్సాప్ సాధారణంగా గూగుల్‌పై ఆధారపడుతుంది. ఇప్పుడు గూగుల్‌ సపోర్ట్‌ లేకుండానే వివిధ డివైజ్‌లలో మీ చాట్‌లు ఓపెన్‌ అయ్యే విధంగా కొత్త అప్‌ డేట్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇప్పటి వరకూ ఇలా..

వాట్సాప్‌ మీ చాట్లను వివిధ డివైజ్‌లలో గూగుల్‌ డ్రైవ్‌ని వినియోగించుకొని సింక్రనైజ్‌ చేస్తుంది. ఇందుకోసం వాట్సాప్‌కు ఇప్పటి వరకూ ప్రత్యేకమైన డివైజ్‌ ఏమి లేదు. ముఖ్యంగా ఆండ్రాయిడ్‌ యూజర్లకు గూగుల్‌ డ్రైవ్‌ లోనే వాట్సాప్‌ చాట్లను బ్యాక్‌ అప్‌ చేస్తుంది. అయితే వాబీటాఇన్‌ఫో రిపోర్టు ప్రకారం.. ఆండ్రాయిడ్‌ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను వాట్సాప్ అభివృద్ధి చేసింది. గూగుల్‌ డ్రైవ్‌ ని వినియోగించుకోకుండా తన సొంతంగా చాట్‌లను బాక్‌ అప్‌ చేసుకొనేలా ఈ ఫీచర్‌ ను తీసుకొచ్చింది. ఇప్పటికే కొన్ని బీటా వెర్షన్లలో దీనిని పరీక్షించినట్లు రిపోర్టు స్పష్టం చేస్తోంది.

చాట్‌ ట్రాన్స్‌ ఫర్‌ ఎలా చేస్తుందంటే..

వాబీటా రిపోర్టు ప్రకారం.. వాట్సాప్‌ కొత్త చాట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఫీచర్‌ను తీసుకొస్తోంది. కొంత మంది బీటా టెస్టర్లకు ఆండ్రాయిడ్‌ 2.23.9.19 అనే అప్‌ డేట్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌ లో అందుబాటులో ఉంది. త్వరలో ఇది అందరికీ అందుబాటులో ఉండనుంది. ఈ ఫీచర్‌ తో చాట్స్‌ ఒక డివైజ్‌ లోని వాట్సాప్‌ నుంచి కొత్త డివైజ్‌లోని వాట్సాప్‌కు ట్రాన్స్‌ ఫర్‌ అవుతాయి. ఈ విధానాన్ని ప్రారంభించాలంటే వినియోగదారులు ఓ క్యూఆర్‌కోడ్‌ ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చే సూచనలు ఫాలో అవ్వాలి. అప్పుడు చాట్‌ హిస్టరీ మొత్తం మరో డివైజ్‌లోకి వచ్చేస్తుంది. ఇది సులభంగా, వేగంగా చాట్‌ హిస్టరీ ట్రాన్స్‌ఫర్‌ ను అనుమతిస్తుంది. గూగుల్‌ డ్రైవ్‌ వినియోగించుకోకుండానే దీనిని ఇది నిర్వహిస్తుంది. కేవలం క్యూ ఆర్‌కోడ్‌ స్కాన్‌ తో చాట్‌ హిస్టరీని పొందడంతో పాటు బ్యాక్‌ కూడా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

టెస్టింగ్‌ దశలోనే..

ఈ ఫీచర్‌ ప్రస్తుతానికి ఇంకా టెస్టింగ్‌ దశలోనే ఉంది. కొంతమంది ఎంపిక చేసిన బీటా టెస్టర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ ను అందుబాటులో ఉంచింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..