House Buying: ఇల్లు కొనుగోలు చేస్తే ఎంత కాలం EMI ఉంటే మంచిది.. డౌన్‌ పేమెంట్‌ ఎంత ఉండాలి?

కొన్ని దశాబ్దాల క్రితం వరకు అన్ని వనరులను ఒకచోట చేర్చి ఇళ్ళ నిర్మాణం జరిగింది. కానీ ఈ రోజుల్లో, ఆస్తులను EMIలపై కొనుగోలు చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో, ఒక మంచి ఫ్లాట్ లేదా ఇల్లు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల మధ్య ఉంటుంది. బ్యాంకులు సాధారణంగా ఆస్తి..

House Buying: ఇల్లు కొనుగోలు చేస్తే ఎంత కాలం EMI ఉంటే మంచిది.. డౌన్‌ పేమెంట్‌ ఎంత ఉండాలి?
House Buying
Follow us
Subhash Goud

|

Updated on: May 05, 2023 | 7:00 AM

కొన్ని దశాబ్దాల క్రితం వరకు అన్ని వనరులను ఒకచోట చేర్చి ఇళ్ళ నిర్మాణం జరిగింది. కానీ ఈ రోజుల్లో, ఆస్తులను EMIలపై కొనుగోలు చేస్తున్నారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాల్లో, ఒక మంచి ఫ్లాట్ లేదా ఇల్లు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల మధ్య ఉంటుంది. బ్యాంకులు సాధారణంగా ఆస్తి విలువలో 80% ఫైనాన్స్ చేస్తాయి. ఇది 35 లక్షల రూపాయలకు పైగా ఉంటుంది. అంటే మిగిలిన 20% మీరే ఏర్పాటు చేసుకోవాలి.

ఒక వ్యక్తి బడ్జెట్ ప్రకారం, అతను ఈరోజు లెక్కల ప్రకారం ఇల్లు కొంటె అది 50 లక్షలకు వస్తుంది అనుకోవచ్చు. అయితే అతను 5 సంవత్సరాల తర్వాత ఆ ఇంటిని కొనాలని అనుకుంటే.. ఈరోజు 50 లక్షల రూపాయలు ఉన్న ఆస్తి ధర సగటున 5 సంవత్సరాల తర్వాత దాని కంటే ఎక్కువగా ఉంటుందని, వార్షిక ప్రాతిపదికన 5 నుంచి 6 శాతం మూలధన అప్రిసియేషన్ ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఈరోజు 50 లక్షల రూపాయల విలువ చేసే ఆస్తి ధర 5 సంవత్సరాల తర్వాత దాదాపు 64 నుంచి 67 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఆస్తి ధర సంవత్సరానికి 5 నుంచి 6 శాతం చొప్పున పెరగాల్సిన అవసరం లేదు. అది కూడా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

దీనిని సరిగ్గా లెక్కవేస్తే..

  • 50,00,000+2,50,000 = 52,50,000 (మొదటి సంవత్సరం)
  • 52,50,000+2,62,500 = 55,12,500 (రెండవ సంవత్సరం)
  • 55,12,500+2,75,625 = 57,88,125 (మూడవ సంవత్సరం)
  • 57,88,125+2,89,406 = 60,77,531 (నాల్గవ సంవత్సరం)
  • 60,77,531+3,03,876 = 63,81,407 (ఐదవ సంవత్సరం)

65 లక్షల రూపాయలలో 80% 52 లక్షల రూపాయలు. మిగిలిన 13 లక్షల రూపాయలను డౌన్ పేమెంట్ కోసం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, లాయర్ ఫీజులు, ఇతర ఖర్చులు కలిపితే దాదాపు 5-6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 5 సంవత్సరాల తర్వాత, దాదాపు 18-19 లక్షల రూపాయలను స్వయంగా చెల్లించాల్సి ఉంటుంది. డౌన్ పేమెంట్ కోసం సొంతంగా ఏర్పాట్లు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

డౌన్ పేమెంట్ చేయడానికి ప్లాన్ చేయడం లోన్ తీసుకునే వారి జీతంపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ ప్రామాణిక నిబంధనల ప్రకారం.. జీతంలో 20% పొదుపుగా ఉండాలి. మీ ఇంటి డౌన్ పేమెంట్ కోసం ఈ సేవింగ్స్‌ని ఉపయోగించాలి. ఉదాహరణకు ఓ వ్యక్తి జీతం నెలకు 1 లక్ష రూపాయలు అయితే, అతను ప్రతి నెలా 20% అంటే 20,000 రూపాయలు ఆదా చేయాలి. అతను ఈ మొత్తాన్ని SIP ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే, అతను 5 సంవత్సరాల తర్వాత మొత్తం 16,49,727 రూపాయలను కూడబెట్టుకోగలడు. ఇది మ్యూచువల్ ఫండ్స్‌లో వార్షిక రాబడి రేటు 12% అని ఊహిస్తూ ఆఫ్‌కోర్స్.. రిటర్న్స్ మార్కెట్ ఆధారితంగా ఉంటాయి అనుకోండి. రాబడులు హెచ్చుతగ్గులకు లోబడి ఉంటాయి. ఇక ఇంటి కోసం డౌన్ పేమెంట్ చేయడానికి ఏర్పాట్లు చేయడానికి మ్యూచువల్ ఫండ్స్‌లో ఎవరు పెట్టుబడి పెట్టాలి. అలాగే స్థిరమైన సాధనాల్లో ఎవరు పెట్టుబడి పెట్టాలి. దీని గురించి తెలుసుకుందాం..

డౌన్ పేమెంట్, ఇతర ఖర్చుల కోసం 5 సంవత్సరాల తర్వాత 16 లక్షల రూపాయల అంచనా మొత్తాన్ని కూడబెట్టుకోగలడు. అప్పుడు కూడా అతనికి 2-3 లక్షల రూపాయలు తగ్గుతాయి. ఇది ఎలా ఏర్పాటు అవుతుందనేది ప్రశ్న. సుశీల్ వార్షిక ఇంక్రిమెంట్‌లో పరిష్కారం ఉంది. సుశీల్ నెలవారీ ఆదాయం ఐదేళ్లపాటు లక్ష రూపాయలు ఉండదు. ప్రతి సంవత్సరం కొంత ఇంక్రిమెంట్ ఉంటుంది. ఈ విధంగా, అతను మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయవచ్చు. అతను తన వార్షిక ఇంక్రిమెంట్‌లో 10 లేదా 20 శాతం మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిని పెంచుకోవచ్చు. వేతనాల పెంపు కారణంగా మ్యూచువల్ ఫండ్స్‌లో తన పెట్టుబడిని పెంచడం ద్వారా అతను మిగిలిన మొత్తాన్ని చెల్లించగలడు.

మ్యూచువల్ ఫండ్స్ కాకుండా, డౌన్ పేమెంట్ కోసం ప్రజలు ఏ ఇతర ఆప్షన్లను ఎంచుకోవచ్చు.?

సాలరీ అంతగా ఉండాల్సిన అవసరం లేదు. అందువల్ల, డౌన్ పేమెంట్ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు, మీరు ఎప్పుడూ మీ జీతాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ఎంత కాలం తర్వాత మీరు మీ కలల ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటున్నారు. కనీసం 5 సంవత్సరాల పాటు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. ముందుగా, ఎమర్జెన్సీ ఫండ్‌ని సృష్టించండి, తద్వారా మీరు అత్యవసర సమయంలో డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. కేవలం డౌన్ పేమెంట్ మాత్రమే సరిపోదు. హోమ్ లోన్ నెలవారీ EMI భారంతో వస్తుంది. ఇంటిని కొనుగోలు చేసే ముందు మీ బడ్జెట్‌కు ఈఎంఐ వల్ల అంతరాయం కలగకుండా చూసుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
ఓరుగల్లు గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శపథం..!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
కుంభకర్ణుడిది అతి నిద్ర కాదట! పురాణ కథపై కొత్త ట్విస్ట్!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
ఓట్లు వేయమని ఎంపీ ముఖం మీదే చెప్పిన మహిళ ..!
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
కాలరెగరేస్తున్న డాలర్.. మరి రూపాయి పరిస్థితి ఏంటి.?
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
ఆమె మళ్లీ వచ్చింది .. పార్లమెంట్‌ దద్దరిల్లింది.! ఎంపీ డాన్స్
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
నిద్ర లేవగానే సెల్‌ఫోన్‌ చూస్తున్నారా.? నిపుణులు చెప్పినవి వింటే
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
ఆ 4 వేల మందిని గనిలోనే సమాధి చేస్తారా.? మూసిన బంగారు గనిలో చిక్కు
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
శివుడు కనిపిస్తాడని వెళ్తే.. ఎలుగుబంట్లు భయపెట్టాయి.! వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
ఆ పులి.. ఈ పులేనా.? వైరల్‌ అవుతున్న పెద్దపులి వీడియో..
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!
మంచుకొండపై మండుతున్న లావా.! ఐస్ ల్యాండ్ లో అగ్ని పర్వతం బ్లాస్ట్!