AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loan Rates Hike: కస్టమర్లకు ఆ బ్యాంక్ షాకింగ్ న్యూస్.. ఈఎంఐలపై వడ్డీ రేట్లు భారీగా పెంపు

ప్రస్తుతం ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా బ్యాంక్ డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు డిపాజిటర్లకు పెంచిన వడ్డీ రేట్ల దెబ్బకు కచ్చితంగా బ్యాంకుల వద్ద రుణాలు తీసుకున్న వారిపై వడ్డీ భారాన్ని మోపుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. వారి అంచనాలకు తగినట్లుగానే బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల బాదుడు షురూ చేశాయి.

Loan Rates Hike: కస్టమర్లకు ఆ బ్యాంక్ షాకింగ్ న్యూస్.. ఈఎంఐలపై వడ్డీ రేట్లు భారీగా పెంపు
Bank Loan
Nikhil
|

Updated on: May 09, 2023 | 4:45 PM

Share

ప్రస్తుతం పెరుగుతున్న ధరల నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏదైనా ప్రాపర్టీ లేదా గృహోపకరణాల కొనాలంటే తలకు మించిన భారంలా తయారవుతుంది. దీంతో కచ్చితంగా రుణాల వైపు మళ్లుతాం. అయితే ప్రస్తుతం ఆర్‌బీఐ తీసుకున్న చర్యల కారణంగా బ్యాంక్ డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచాయి. ఈ నేపథ్యంలో బ్యాంకులు డిపాజిటర్లకు పెంచిన వడ్డీ రేట్ల దెబ్బకు కచ్చితంగా బ్యాంకుల వద్ద రుణాలు తీసుకున్న వారిపై వడ్డీ భారాన్ని మోపుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. వారి అంచనాలకు తగినట్లుగానే బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్ల బాదుడు షురూ చేశాయి. అంటే ఇప్పటికే బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న వారు, రుణాలు తీసుకోబోయే వారిపై ఈ పెరిగిన వడ్డీ రేట్లు ప్రభావం చూపనున్నాయి. తాజాగా ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ తన ఖాతాదారులకు షాక్ ఇస్తూ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసిఎల్‌ఆర్) 5-15 బేసిస్ పాయింట్లు బీపీఎస్) పదవీకాల వ్యవధిలో పెంచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, కొత్త రుణ వడ్డీ రేట్లు మే 8, 2023 నుండి అమలులోకి వస్తాయని పేర్కొంది.

పెరిగిన వడ్డీ రేట్లు ఇలా

బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 7.95 శాతంగా ఉంది.. ఒక నెల ఎంసీఎల్ఆర్ 8.10 శాతం మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.40 శాతం, 8.80 శాతం ఉంది. అనేక వినియోగదారుల రుణాలకు అనుసంధానించబడిన ఒక సంవత్సరం ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 9.05శాతం, రెండు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 9.10 శాతం, మూడు సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 9.20 శాతం ఉంటుంది. దీంతో సగటు ఖాతాదారుడిపై ఈఎంఐల భారం భారీగా పెరగనుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..