Saving Account Interest Rates: పొదుపు ఖాతాలపై ఏ బ్యాంకులు ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నాయో తెలుసా..?

ప్రస్తుతం చాలా బ్యాంకులు పొదుపు ఖాతాపై కూడా మంచి వడ్డీని ఇవ్వడం ప్రారంభించాయి. ఎస్‌బీఐ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి బ్యాంకులు..

Saving Account Interest Rates: పొదుపు ఖాతాలపై ఏ బ్యాంకులు ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నాయో తెలుసా..?
Sukanya Samriddhi YojanaImage Credit source: TV9 Telugu
Follow us
Subhash Goud

|

Updated on: Mar 17, 2023 | 7:40 AM

ప్రస్తుతం చాలా బ్యాంకులు పొదుపు ఖాతాపై కూడా మంచి వడ్డీని ఇవ్వడం ప్రారంభించాయి. ఎస్‌బీఐ నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి బ్యాంకులు సేవింగ్స్ ఖాతాపై ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. కొన్ని బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు సమానమైన వడ్డీని ఇచ్చే అనేక బ్యాంకులు ఉన్నాయి. అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే పొదుపు ఖాతాలపై సీనియర్ సిటిజన్‌లకు అధిక వడ్డీ ఆప్షన్‌ లేదు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తర్వాత చాలా బ్యాంకులు పొదుపు ఖాతాలపై వడ్డీని పెంచాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంకులు అందిస్తున్న పొదుపు ఖాతా వడ్డీల గురించి తెలుసుకోండి.

  1. ఎస్‌బీఐ సేవింగ్స్ ఖాతా: దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన ఎస్‌బీఐ రూ.10 కోట్ల వరకు డిపాజిట్లపై 2.70 శాతం వడ్డీని, సేవింగ్స్ ఖాతాలో రూ.10 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్లపై 3 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
  2. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో రూ. 50 లక్షల కంటే తక్కువ డిపాజిట్లపై 3 శాతం వడ్డీని చెల్లిస్తోంది. అలాగే అంతకు మించిన డిపాజిట్లపై 3.50 శాతం వడ్డీని చెల్లిస్తుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. కెనరా బ్యాంక్: ఇక కెనరా బ్యాంక్ వివిధ మొత్తాల మీద 2.90 శాతం నుంచి 4 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. రూ.2000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ విలువైన డిపాజిట్ల మీద గరిష్టంగా 4 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
  5. ఐసీఐసీఐ బ్యాంక్: ఈ బ్యాంకులో రూ. 50 లక్షల వరకు ఉన్న డిపాజిట్ల మీద 3% వడ్డీ అందుతుంది. అదే సమయంలో, రూ. 50 లక్షల కంటే ఎక్కువ విలువైన డిపాజిట్ల మీద 3.50 శాతం వడ్డీ అందుతుంది.
  6. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌: పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 10 లక్షల వరకు విలువైన డిపాజిట్ల మీద 2.70 శాతం వడ్డీని అందిస్తోంది. రూ. 10 లక్షల కంటే పైబడి విలువున్న డిపాజిట్ల మీద 2.75 శాతం వడ్డీ ఇస్తోంది. ఇదే సమయంలో, 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న డిపాజిట్ల మీద 3 శాతం వడ్డీ ఇవ్వబడుతుంది.
  7. యూనియన్ బ్యాంక్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 50 లక్షల డిపాజిట్ల మీద 2.75 శాతం, రూ. 50 లక్షల నుంచి 100 కోట్ల వరకు డిపాజిట్లపై 2.90 శాతం వడ్డీ ఇస్తోంది. రూ. 100 కోట్ల కంటే ఎక్కువ విలువైన డిపాజిట్ల మీద 3.10 శాతం వడ్డీ ఇస్తోంది. రూ. 500 కోట్లకు పైగా ఉన్న డిపాజిట్ల మీద వార్షిక వడ్డీగా 3.40 శాతం చెల్లిస్తోంది. రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ విలువైన డిపాజిట్ల మీద అత్యధికంగా 3.55 శాతం వడ్డీ ఇస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
మౌనముని, ఆర్థిక మేధావికి అంతిమ వీడ్కోలు
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?
సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు
సైనిక లాంఛనాలతో మన్మోహన్ అంత్యక్రియలు