AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Account: బ్యాంకు అకౌంట్లో డబ్బులు లేవా..? అయినా పర్వాలేదు రూ.10 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు.. ఎలాగంటే..

దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలను తీసుకువస్తోంది. ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల మార్గాలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇక మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు..

Bank Account: బ్యాంకు అకౌంట్లో డబ్బులు లేవా..? అయినా పర్వాలేదు రూ.10 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు.. ఎలాగంటే..
Cash
Subhash Goud
|

Updated on: Mar 16, 2023 | 6:50 AM

Share

దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలను తీసుకువస్తోంది. ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల మార్గాలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇక మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కూడా పథకాలను ప్రవేశపెడుతుందని మోడీ సర్కార్‌. దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద సుమారు 47 కోట్లకుపైగా మంది ఖాతాలు తెరిచారు. అయితే కోట్లాది మందికి ఈ ఖాతాలో అందుబాటులో ఉన్న పథకాల గురించి తెలియదు. జన్ ధన్ ఖాతాదారులకు ప్రభుత్వం 10 వేల రూపాయలు అందజేస్తోంది. దీని కోసం మీరు బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కాకుండా ఈ ఖాతాలో రూ.1 లక్ష 30 వేల బీమా వంటి అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీకు కూడా ఈ పథకాల గురించి తెలియకపోతే వెంటనే తెలుసుకొని 10 వేల రూపాయలకు దరఖాస్తు చేసుకోండి. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన లోన్ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

జన్ ధన్ ఖాతాలో ఖాతాదారునికి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో మొదటి ప్రయోజనం ఏమిటంటే ఖాతాదారుడు ఈ ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయడం గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా రూపే డెబిట్ కార్డ్‌ను అందజేస్తారు. మీరు బ్యాంకులో దరఖాస్తు చేయడం ద్వారా ఈ ఖాతాలో రూ.10,000 ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. ఇది వరకు ఈ మొత్తం రూ.5 వేలు ఉండేది. దీనిని రూ.10వేలకు పెంచింది. అకౌంట్లో డబ్బులు లేకున్నా ఈ సదుపాయం పొందవచ్చు. దీని కోసం మీరు మీ బ్యాంకు శాఖను సంప్రదించాలి. కాగా, దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలకు చెందిన వారు జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకుల్లో అకౌంట్లను తెరవడానికి ఉద్దేశించినదే ఈ ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకం. ఈ స్కీమ్‌ కింద అకౌంట్‌ ఓపెన్ చేసిన వారికి ఈ ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా లభిస్తుంది.

ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏమిటి?

ఖాతాదారుని ఖాతాలో బ్యాలెన్స్ లేనప్పటికీ బ్యాంకు ఖాతా నుంచి(పొదుపు లేదా కరెంట్) నిర్ణీత మొత్తం వరకు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఇతర క్రెడిట్ సదుపాయాల వలే, ఖాతాదారుడు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ద్వారా నగదు విత్ డ్రా చేసినప్పుడు కొంత వడ్డీ కట్టాల్సి ఉంటుంది. స్వల్పకాలిక రుణం రూపంలో జన్ ధన్ ఖాతాదారులు రూ.10వేల వరకు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ పరిమితి ఇంతకు ముందు రూ.5 వేల వరకు ఉండేది. కానీ ప్రభుత్వం ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది.

ఇవి కూడా చదవండి

ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఏ విధంగా పనిచేస్తుంది..?

ఈ స్కీమ్‌ కింద ఖాతాలు ఓపెన్‌ చేసిన ఖాతాదారులు తమ ఖాతాల్లో ఉన్న దానికంటే ఎక్కువ డబ్బును అప్పు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి కొన్ని నిబంధనలు రూపొందించింది కేంద్రం. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే పీఎంజేడీవై ఖాతా యజమాని కనీసం ఆరు నెలల పాటు దానిని ఆపరేట్ చేసి ఉండాలి. అదే విధంగా ఒక నిర్ధిష్ట కుటుంబంలోని ఒక సభ్యుడు మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందవచ్చు. సాధారణంగా మహిళా సభ్యులకు అవకాశం ఉంటుంది. అంతేకాదు ఖాతాదారునికి మంచి సిబిల్‌ స్కోర్‌ ఉండాలి. పీఎంజేడీవై ఓవర్ డ్రాఫ్ట్ కింద రూ.2 వేల వరకు ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు. ఓవర్ డ్రాఫ్ట్ గరిష్ట వయోపరిమితిని కూడా ప్రభుత్వం 60 నుండి 65 సంవత్సరాలకు పెంచింది.

జన్ ధన్ ఖాతాదారులకు ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తుంది. ఇందులో ఖాతాదారునికి లక్ష రూపాయల ప్రమాద బీమా ఇవ్వబడుతుంది. దీంతోపాటు 30 వేల రూపాయల జీవిత బీమా కూడా అందజేస్తారు. ఖాతాదారుడు ప్రమాదంలో మరణిస్తే ఆ ఖాతాదారుడి కుటుంబానికి రూ.లక్ష బీమా కవరేజీని అందజేస్తారు. మరోవైపు, సాధారణ పరిస్థితుల్లో మరణం సంభవిస్తే, అప్పుడు రూ.30,000 బీమా కవరేజీ ఉంటుంది.

జన్ ధన్ ఖాతాను ఎలా తెరవాలి

మీరు కూడా ఈ పథకాల ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, ఇప్పటి వరకు మీరు ఏ జన్ ధన్ ఖాతాను తెరవనట్లయితే అకౌంట్‌ను ఓపెన్‌ చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డ్ కలిగి ఉండాలి. బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..