AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reliance Jio: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.399కే సరికొత్త ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌.. పూర్తి వివరాలు

ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త రిఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే జియో ప్లిస్‌ స్కీమ్‌ కింద కొత్త పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్స్‌ను..

Reliance Jio: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.399కే సరికొత్త ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌.. పూర్తి వివరాలు
Jio
Subhash Goud
|

Updated on: Mar 15, 2023 | 5:30 AM

Share

ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త రిఛార్జ్‌ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే జియో ప్లిస్‌ స్కీమ్‌ కింద కొత్త పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్స్‌ను తీసుకువస్తోంది. ఇక రెండు ఫ్యామిలీ ప్లాన్స్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్స్‌లో అపరిమిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు, నెల ఫ్రీ ట్రెయిల్‌ లభిస్తుంది. ఈ ప్లాన్‌ మార్చి 22వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నట్లు జియో తెలిపింది.

ఫ్యామిలీ ప్లాన్స్‌ వివరాలు ఏమిటి..?

రూ.3999 జియో పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌లో అపరిమిత కాల్స్‌తో పాటు 75GB డేటా లభిస్తుంది. ముగ్గురు ఫ్యామిలీ మెంబర్లను ఇందులో యాడ్‌ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌ కోసం రూ.500 సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. జియో అందుబాటులోకి తీసుకువచ్చిన మరో ప్లాన్‌ రూ.699. ఈ ప్లాన్‌ ద్వారా యూజర్లు అపరిమిత కాల్స్‌, 100GB డేటా, ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఇందులో కూడా ముగ్గురు ఫ్యామిలీ మెంబర్లను యాడ్‌ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో అదనంగా నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఓటీటీ వంటి సర్వీసులు ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్యాక్‌కు రూ.875 సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌ కింద తీసుకొనే ఒక్కో నంబర్‌పై అదనంగా రూ.99లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.399ప్లాన్‌ తీసుకునే వ్యక్తితో పాటు మరో ఇద్దరు రూ.99 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మొత్తంగా ఈ ప్లాన్‌ తీసుకునేందుకు రూ.399తో పాటు అదనంగా రూ.198 చెల్లించాల్సి ఉంటుంది.

ఇక జియో వ్యక్తిగతంగా చూస్తే పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌లు రూ.299 నుంచి ప్రారంభం అవుతాయి. ఈ ప్లాన్‌లో 30జీబీ డేటా లభిస్తుంది. అందులో అపరిమిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయి. ఈ ప్లాన్‌ కింద రూ.375 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫ్రీ ట్రైయిల్‌ సదుపాయం ఉండదు. ఇక మరో ప్లాన్‌ ఏంటంటే రూ.599. దీని కింద అపరిమిత కాల్స్‌, ఆన్‌లిమిటెడ్‌ డేటా, ఆన్‌లిమిటెడ్‌ ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయి. ఈ ప్లాన్‌ కోసం రూ.750 సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

Jio Plans

Jio Plans

ఈ పోస్ట్‌ పెయిడ్‌ కనెక్షన్‌  ఎలా తీసుకోవాలి..?

ఈ పోస్ట్‌ పెయిడ్‌ కనెక్షన్‌ తీసుకోవాలంటే ముందుగా 70000 70000 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. పోస్ట్‌ పెయిడ్‌ సిమ్‌ను హోమ్‌ డెలివరీ చేస్తారు. ఇదే సమయంలో కుటుంబ సభ్యుల సిమ్‌ కార్డును యాక్టివేషన్‌ చేసుకోవచ్చు. ఒక్కో సిమ్‌ కార్డు యాక్టివేషన్‌కు రూ.99 చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి మెయిన్‌ సిమ్‌ యాక్టివేట్‌ అయ్యాక మిగిలిన మూడు సిమ్‌లను అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పటికే జియో ప్రీపెయిడ్‌ కస్టమర్ అయి ఉంటే సిమ్‌ మార్చకుండానే మై జియో యాప్‌ ద్వారా ప్రీపెయిడ్‌ నుంచి పోస్ట్‌ పెయిడ్‌కు మార్చుకోవచ్చని రిలయన్స్‌ జియో తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ బిగ్ షాక్.. భారీగా తగ్గించిన జీతాలు..
రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ బిగ్ షాక్.. భారీగా తగ్గించిన జీతాలు..
ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ
ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..
ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..
ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే
ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత