Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Best Interest Rate: ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? ఈ ప్రైవేటు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే 8.5 శాతం వరకు వడ్డీ

మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సరైన పథకంలో పెట్టడం ద్వారా మంచి వడ్డీని పొందాలనుకుంటే, మీరు బ్యాంక్ FD స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

Best Interest Rate: ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలనుకుంటున్నారా? ఈ ప్రైవేటు బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే 8.5 శాతం వరకు వడ్డీ
Percent Interest On Saving Accounts
Follow us
Madhavi

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 16, 2023 | 11:01 AM

మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సరైన పథకంలో పెట్టడం ద్వారా మంచి వడ్డీని పొందాలనుకుంటే, మీరు బ్యాంక్ FD స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ప్రైవేట్ రంగ బంధన్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే ఎఫ్‌డి వడ్డీ రేట్లను 0.50 శాతం పెంచింది. ఈ నేపథ్యంలో మీరు పెట్టిన డబ్బుకు ఎంత వడ్డీ వస్తుందో తెలుసుకోండి.

సీనియర్ సిటిజన్లకు 8.5 శాతం వడ్డీ లభిస్తుంది;

ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు 8.5 శాతం వడ్డీ సాధారణ ఖాతాదారులకు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8 శాతం వడ్డీ ప్రయోజనం లభిస్తుందని బంధన్ బ్యాంక్ సోమవారం తెలిపింది. వడ్డీని పెంచిన తర్వాత, ఇప్పుడు సీనియర్ సిటిజన్లకు 8.5 శాతం ఇతర పౌరులకు 8 శాతం చొప్పున 600 రోజుల వ్యవధి గల బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FD) వడ్డీ లభిస్తుంది. అదే విధంగా, 1 సంవత్సరం కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 7 శాతానికి పెంచారు. అంటే ఇప్పుడు సీనియర్ సిటిజన్లు బంధన్ బ్యాంక్‌లో 0.5 శాతం అదనపు వడ్డీ ప్రయోజనాన్ని పొందగలుగుతారు.

ఇవి కూడా చదవండి

ఆర్‌బీఐ రెపో రేటును పెంచింది:

రెపో రేటును నిర్ణయించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ సమావేశం నిర్వహించింది. గతేడాది 2022లో ఆర్‌బీఐ రెపో రేటును పెంచింది. ఫలితంగా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లు పెంచాయి. ఆ తర్వాత బ్యాంకుల్లో గృహ రుణాలు, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు కూడా పెరిగాయి.

ఈ బ్యాంకులు కూడా వడ్డీని పెంచాయి:

అంతకుముందు, IDFC FIRST బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచింది. ఈ బ్యాంకులో, సీనియర్ సిటిజన్లు 18 నెలల నుండి 3 సంవత్సరాల కాలవ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8% వడ్డీని పొందుతున్నారు. అదే జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా తన FDలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. జన బ్యాంక్ ఇప్పుడు 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉన్న FDలపై 8.10 శాతం వరకు వడ్డీని చెల్లిస్తోంది. అదే సమయంలో, సీనియర్ సిటిజన్లు ఈ ఎఫ్‌డిపై 8.80 శాతం వడ్డీని పొందుతున్నారు.

బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్ల పెంపు:

దేశంలోని ప్రముఖ ఎన్‌బిఎఫ్‌సి కంపెనీ బజాజ్ ఫైనాన్స్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. బజాజ్ ఫైనాన్స్ FD రేట్లను 35 బేసిస్ పాయింట్లు 0.35 శాతం వరకు పెంచింది. FDపై అన్ని కొత్త వడ్డీ రేట్లు 4 మార్చి 2023 నుండి అమలులోకి వచ్చాయి. బజాజ్ ఫైనాన్స్ ప్రకారం, ఈ పెరుగుదల తర్వాత, ఇప్పుడు సీనియర్ సిటిజన్లు 44 నెలల కాలానికి రూ. 15 వేల నుండి రూ. 5 కోట్ల వరకు FDలపై గరిష్టంగా 8.20 శాతం వడ్డీని పొందుతారు. అదే సమయంలో, 60 సంవత్సరాల వయస్సు ఉన్నవారు సంవత్సరానికి 7.95 శాతం వడ్డీని పొందగలరు. బజాజ్ ఫైనాన్స్ గత సంవత్సరం 33 నెలల కాలవ్యవధితో FD పథకాన్ని ప్రారంభించింది. ఈ FDపై వడ్డీ రేట్లు ఇప్పుడు సంవత్సరానికి 7.70 శాతం నుండి 7.75 శాతానికి పెంచింది. ఇందులో, సీనియర్ సిటిజన్లకు సంవత్సరానికి 8.00 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి