AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. లక్ష వరకు సంపాదన.. మోదీ సర్కారు లోన్ కూడా ఇస్తుంది..

వ్యాపారం చేయడం ద్వారా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా ద్వారా మనం ప్రతి నెల ఒక లక్ష రూపాయలు వరకు సంపాదించే అవకాశం ఉంది.

Business Ideas: ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. లక్ష వరకు సంపాదన.. మోదీ సర్కారు లోన్ కూడా ఇస్తుంది..
Business Ideas
Madhavi
| Edited By: Janardhan Veluru|

Updated on: Mar 16, 2023 | 10:40 AM

Share

వ్యాపారం చేయడం ద్వారా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా, అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా ద్వారా మనం ప్రతి నెల ఒక లక్ష రూపాయలు వరకు సంపాదించే అవకాశం ఉంది. అలాంటి ఓ వ్యాపారం గురించి తెలుసుకుందాం. అన్నింటి కన్నా ముందు వ్యాపారం కోసం పెట్టుబడి అవసరం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ముద్ర యోజన రుణాలను అందుకొని మీరు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. తద్వారా బయట ప్రైవేటు రుణాల కన్నా కూడా చాలా తక్కువ వడ్డీకే రుణాన్ని పొందే వీలుంది. దేశంలోని అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లో ముద్రా రుణాలను అందిస్తున్నారు 10,000 నుంచి 10 లక్షల వరకు ముద్ర రుణాలను పొందే వీలుంది. మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించిన లేకపోతే ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్న ముద్ర రుణాలను పొందే అవకాశం ఉంది. ఇందుకోసం కొద్దిగా పేపర్ వర్క్ చేస్తే చాలు..మీకు కావాల్సిన రుణం మీ గ్రామంలోని ప్రభుత్వ బ్యాంకు ద్వారా పొందే వీలుంది.

ఇక పెట్టుబడి తర్వాత మీరు వ్యాపారం చేయాలి అనుకుంటే, మీ ప్రాంతంలోనే కేటరింగ్ సర్వీసును ప్రారంభించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితం అయిన కేటరింగ్ సర్వీసు ఇప్పుడు చిన్న గ్రామాలకు సైతం పాకింది. ఎందుకుంటే ప్రస్తుతం ఏ ఫంక్షన్ అయినా, పదిమంది కలిసినా విందు వినోదాలు సాధారణం అయ్యాయి. దీన్నే మీరు వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు.

మీరు కేటరింగ్ వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే, ముందుగా మీరు వంట సామాన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కనీసం 50 నుంచి 100 మందికి సరిపడా వండ గలిగే వంట పాత్రలను కొనుగోలు చేసుకోవాలి. అలాగే కేటరింగ్ సర్వీసులో పనిచేసేందుకు కావాల్సిన వంట వాళ్లను కూడా మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. వీరికి మీరు రోజు వారీ కూలీ ఇచ్చేలా మాట్లాడుకుంటే మేలు. మీ కేటరింగ్ సామాన్లను వండిన వంటలను తీసుకెళ్లడానికి ఒక కేరియర్ ట్రాలీ ఆటో అద్దెకు తీసుకుంటే ఫంక్షన్ వెళ్లే ప్రదేశానికి వేగంగా చేరుకునే వీలుంటుంది.

ఇవి కూడా చదవండి

దీనికి ప్రాథమికంగా పెట్టుబడికి సుమారు రూ. 2 లక్షల వరకూ ఖర్చు అవుతాయి. ఇందులో వంట సామాగ్రి కోసం దాదాపు లక్ష రూపాయల వరకూ అవుతుంది. అలాగే ఒక పెద్ద వంటగదిని నిర్మించుకోవాలి. దానికి నీరు, కరెంటు సప్లై ఉండేలా చూసుకోావాలి. కనీసం 150 చదరపు గజాల విస్తీర్ణంలో మీ వంటగదిని నిర్మించుకోవాలి. అప్పుడు మీరు సులభంగా ఆర్డర్లకు వంటలను తయారు చేసుకోవచ్చు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది పబ్లిసిటీ చేయడం. ఇందుకోసం న్యూస్ పేపర్లు, కరపత్రాలు, డిజిటల్ మీడియాను వాడుకోవాలి. ముందుగా మీరు ఆర్డర్లు పొందిన తర్వాత మీరు కేటరింగ్ చేసే ప్రదేశానికి వచ్చిన అతిథులకు మీ ఫోన్ నెంబర్, వివరాలను అందివ్వాలి. వారికి ఆసక్తి ఉంటే మీకు ఆర్డర్లు వస్తాయి. అలాగే నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. క్యాటరింగ్ సర్వీసుకు అనుబంధంగా, కర్రీ పాయింట్ పెట్టుకుంటే అదనపు ఆదాయం లభిస్తుంది. తద్వారా మీ పనివారికి కూడా శాశ్వతంగా పని కల్పించే వీలుంటుంది. కేటరింగ్ సర్వీసు చేయడం ద్వారా నెలకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ సంపాదించుకునే వీలుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!