Pension Scheme: మోడీ సర్కార్‌ అద్భుతమైన పెన్షన్‌ స్కీమ్.. మార్చి 31 వరకే అవకాశం.. దరఖాస్తు చేయండిలా!

దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తోంది. ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ రకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. పెన్షన్‌దారులకు..

Pension Scheme: మోడీ సర్కార్‌ అద్భుతమైన పెన్షన్‌ స్కీమ్.. మార్చి 31 వరకే అవకాశం.. దరఖాస్తు చేయండిలా!
Pension Scheme
Follow us
Subhash Goud

|

Updated on: Mar 16, 2023 | 5:35 AM

దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తోంది. ఆర్థికంగా ఎదిగేందుకు వివిధ రకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది. పెన్షన్‌దారులకు పెన్షన్‌ స్కీమ్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇదే ప్రధాన మంత్రి వయ వందన యోజన. ఈ స్కీమ్‌ కింద లబ్ధిదారునికి పెన్షన్‌ హామీ ఇవ్వబడుతుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 26 మే 2020న ప్రారంభించింది. మీరు కూడా ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే ఈ స్కీమ్ కోసం 31 మార్చి 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 60 ఏళ్లు నిండిన తర్వాత భార్యాభర్తలిద్దరూ ఈ పథకం కింద పెన్షన్ తీసుకోవచ్చు.

వయ వందన యోజన అంటే ఏమిటి?

ప్రధాన మంత్రి వయ వందన యోజన ఒక సామాజిక భద్రతా పథకం. దీని కింద దరఖాస్తుదారునికి వార్షిక, త్రైమాసిక లేదా నెలవారీ పెన్షన్ ఇవ్వాలని నిబంధన ఉంది. భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) నిర్వహిస్తుంది. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ఈ పథకంలో అర్హులు. ఈ పథకం కింద వారు గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇంతకుముందు ఈ పథకంలో కేవలం రూ. 7.5 లక్షలు మాత్రమే ఉండేది. తర్వాత ఈ మొత్తాన్ని డబుల్‌ చేసింది కేంద్రం. ఈ ప్లాన్‌పై సీనియర్ సిటిజన్‌లు ఎక్కువ ఆసక్తి చూపుతారు.

ఏడాదికి 51 వేల రూపాయలు:

భార్యాభర్తలిద్దరూ ఈ పథకంపై వార్షిక వడ్డీ 7.40 శాతం అందుకోవచ్చు. పెట్టుబడిదారుడి వార్షిక పెన్షన్ రూ.51 వేలు అవుతుంది. మీరు ఈ పెన్షన్‌ను నెలవారీగా తీసుకోవాలనుకుంటే ప్రతి నెలా మీకు పెన్షన్‌గా రూ.4100 అందుతుంది. ప్రతి నెల రూ.1,000 పెన్షన్ పొందడానికి మీరు రూ.1.62 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఈ పథకం కింద గరిష్టంగా రూ.9250 పెన్షన్ పొందవచ్చు. అయితే దీని కోసం మీరు రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాలి.

ఇవి కూడా చదవండి

10 సంవత్సరాల తర్వాత పూర్తి డబ్బు:

ఈ పథకంలో మీ పెట్టుబడి 10 సంవత్సరాలు. మీకు 10 సంవత్సరాల పాటు వార్షిక లేదా నెలవారీ పెన్షన్ ఇవ్వబడుతుంది. మీరు ఈ పథకంలో 10 సంవత్సరాల పాటు కొనసాగితే తర్వాత మీ పెట్టుబడి మీకు తిరిగి వస్తుంది. మీరు ఎప్పుడైనా ఈ ప్లాన్‌లో సరెండర్ చేయవచ్చు. దీనిపై పూర్తి వివరాలు కావాలంటే సమీపంలో ఉన్న బ్యాంకుల్లో గానీ, పోస్టాఫీసుల్లో గానీ తెలుసుకోవచ్చు.

నీస ప్రీమియం మొత్తం రూ. 1,56,658 . 2018 లో గరిష్ట ప్రీమియం రూ .7.5 లక్షల నుంచి రూ .15 లక్షలకు పెంచబడింది. ఈ పాలసీలో మీరు 10 సంవత్సరాల కాలానికి నెలకు కనిష్టంగా రూ .1,000 నుంచి గరిష్టంగా రూ .9,250 వరకు పెన్షన్ పొందవచ్చు. మీరు చెల్లించే ప్రీమియంలో కొంత శాతాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. 7.40 శాతం నుంచి 7.66 శాతం వరకు వడ్డీ చెల్లిస్తుంది. నెలవారీ పెన్షన్‌ రూ.7.40 వడ్డీ లభిస్తుంది. వార్షిక పెన్షన్ విషయంలో గరిష్టంగా 7.66 శాతం వడ్డీ వస్తుంది.నెలవారీ పెన్షన్ కూడా చెల్లించవచ్చు. లేదా 3 నెలలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి చేయవచ్చు.

ప్రధాన మంత్రి వయ వందన యోజన పాలసీని ఎలా కొనుగోలు చేయాలి ?

  • ప్రధానమంత్రి వయ వందన యోజన వృద్ధుల కోసం రూపొందించబడింది. అందుకే దీని కనీస వయస్సు 60 సంవత్సరాలు.
  • పాలసీదారు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి
  • వన్ టైమ్ ప్రీమియం చెల్లించాలి.
  • ప్రీమియం మొత్తం రూ. 1,56,658 నుంచి రూ. 15,00,000 వరకు ఉంటుంది.
  • 10 సంవత్సరాలకు పెన్షన్‌ వస్తుంది.
  • కనీస పెన్షన్ నెలకు రూ 1,000 లేదా సంవత్సరానికి రూ 12,000.
  • పాలసీ యాక్టివ్‌గా ఉన్న 10 సంవత్సరాలలోపు పాలసీదారు మరణిస్తే నామినీకి మొత్తం ప్రీమియం తిరిగి చెల్లించబడుతుంది.
  • పాలసీదారు 10 సంవత్సరాల తర్వాత జీవించి ఉంటే ప్రీమియం మొత్తం తిరిగి అందిస్తారు.
  • మీరు రూ. 15 లక్షల ప్రీమియం చెల్లిస్తే, ఏడాదికి రూ. 1.1 లక్షలు పొందుతారు. 10 ఏళ్ల తర్వాత 15 లక్షల డబ్బు కూడా చేతికి వస్తుంది.

ప్రధాన మంత్రి వయ వందన యోజన పాలసీ గణన:

మీరు రూ. 1,56,658 నుంచి కనీస మొత్తానికి పాలసీని కొనుగోలు చేస్తే ఈ మొత్తానికి ఏడాదికి రూ.12,000 పెన్షన్ వస్తుంది. అర్ధ సంవత్సరం పెన్షన్ కోసం పాలసీ ప్రీమియం మొత్తం రూ. 1,59,574 అవుతుంది. మీకు నెలవారీ పెన్షన్ కావాలంటే మీరు రూ.1,62,162 ప్రీమియం చెల్లించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!