AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC Loan: అదానీ గ్రూప్‌పై ఎల్‌ఐసీ రుణం తగ్గిందా..? కీలక విషయాలు వెల్లడించిన మంత్రి నిర్మలమ్మ

అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వచ్చినప్పటి నుంచి గ్రూప్ కంపెనీల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) పెట్టుబడులు..

LIC Loan: అదానీ గ్రూప్‌పై ఎల్‌ఐసీ రుణం తగ్గిందా..? కీలక విషయాలు వెల్లడించిన మంత్రి నిర్మలమ్మ
LIC - Adani
Subhash Goud
|

Updated on: Mar 14, 2023 | 6:11 AM

Share

అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక వచ్చినప్పటి నుంచి గ్రూప్ కంపెనీల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి) పెట్టుబడులు, గ్రూప్‌కు ఇచ్చే రుణాలపై ఆందోళన నెలకొంది. ఎల్‌ఐసీకి చెందిన అదానీ గ్రూపునకు ఇచ్చిన రుణం ఇప్పుడు తగ్గిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

మార్చి 5 వరకు ఉన్న డేటా ప్రకారం.. గౌతమ్ అదానీ కంపెనీలకు ఎల్‌ఐసి ఇచ్చిన మొత్తం రుణం రూ.6,183 కోట్లు అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 31 డిసెంబర్ 2023 నాటికి ఇది రూ. 6,347 కోట్లు.

ఎల్‌ఐసీ ఏ కంపెనీకి ఎంత రుణం:

రుణాలే కాకుండా అదానీ గ్రూప్‌కు చెందిన 10 లిస్టెడ్ కంపెనీల్లో కూడా ఎల్‌ఐసీ పెట్టుబడులు పెట్టింది. ఈ మొత్తం దాదాపు రూ.30,000 కోట్లు. అదే సమయంలో అదానీ గ్రూప్‌కు చెందిన వివిధ కంపెనీలకు ఎల్‌ఐసి వేర్వేరు రుణాలను ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

ఎల్‌ఐసి మొత్తం రూ. 6,183 కోట్ల రుణంలో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎపిఎస్‌ఇజెడ్) కి రూ. 5,390 కోట్లు. అదానీ పవర్ (అదానీ పవర్-ముంద్రా) కి రూ. 266 కోట్లు, అదానీ పవర్ మహారాష్ట్ర లిమిటెడ్-ఫేజ్ 3 అదానీకి రూ. 254.87 కోట్లు ఉన్నాయి. పవర్ మహారాష్ట్ర లిమిటెడ్-ఫేజ్ III, రాయ్‌ఘర్ ఎనర్జీ జనరేషన్ లిమిటెడ్‌కు రూ. 45 కోట్లు, రాయ్‌పూర్ ఎనర్జీ లిమిటెడ్‌కు రూ. 145.67 కోట్లు.

అదానీకి ఈ ప్రభుత్వ సంస్థల నుంచి ఎలాంటి రుణం లేదు:

లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీనితో పాటు 5 ప్రభుత్వ సాధారణ బీమా కంపెనీలలో ఏదీ అదానీ గ్రూప్ కంపెనీలకు రుణాలు ఇవ్వలేదని కూడా తెలిపారు. ఇదొక్కటే కాదు, ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలను అంచనా వేసిన తర్వాతే గ్రూపు కంపెనీలకు రుణాలు మంజూరు చేసినట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులు మంత్రిత్వ శాఖకు తెలిపాయి.

అమెరికన్ షార్ట్ సెల్లర్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక రావడంతో అదానీ గ్రూప్ క్రెడిట్ క్రంచ్‌ను ఎదుర్కొంటోంది. గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లు కూడా దిగజారాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో అదానీ గ్రూప్ షేరు ధరను తారుమారు చేసిందని, అకౌంటింగ్ మోసానికి పాల్పడిందని ఆరోపించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ