AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: అర ఎకరం ఉంటే చాలు సంవత్సరానికి అరకోటి మీ సొంతం అయ్యే బిజినెస్ ఇదే…

ఒక హెక్టారు భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు దాదాపు 4 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు తర్వాత ప్రతి సంవత్సరం ఆ భూమి నుండి సుమారు 8 నుండి 10 లక్షల వరకు సంపాదించవచ్చు.

Business Idea: అర ఎకరం ఉంటే చాలు సంవత్సరానికి అరకోటి మీ సొంతం అయ్యే బిజినెస్ ఇదే...
Representative Image
Madhavi
| Edited By: Ravi Kiran|

Updated on: Mar 14, 2023 | 9:40 AM

Share

మీరు ఉద్యోగంతోపాటు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే మీకో బెస్ట్ ఐడియా గురించి మేము మీకు వివరిస్తాము. కానీ ఈ వ్యాపారం ప్రారంభించాలంటే కాస్త పెట్టుబడి ఎక్కువగానే ఉంటుంది. ఒక్కసారి పెట్టుబడి పెడితే…జీవితాంతం ఆదాయాన్ని పొందవచ్చు. మీ దగ్గర పెట్టుబడి పెట్టే స్తోమత లేకుంటే కేంద్రంలో మోదీ సర్కార్ అందిస్తున్న ముద్ర రుణాన్ని తీసుకుని ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీకు వ్యవసాయ భూమి ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే బిజినెస్ పండ్లతోటలకు సంబంధించింది. అవును మేముకు మీకు చెప్పబోయే వ్యాపారం డ్రాగన్ ఫ్రూట్ వ్యాపారం. ఈ వ్యాపారం చేయాలంటే దాదాను రెండు మూడు ఎకరాల భూమి ఉంటే చాలు. లేదంటే కౌలుకు తీసుకోని అయినా సరే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. భారత్ లో ఈ వ్యాపారాన్ని చాలా మంది చేస్తున్నారు. ఒక్కప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే సాగు చేసే ఈ పంట ఇఫ్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం సాగు చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ వ్యాపారం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

డ్రాగన్ ఫ్రూట్. ఈ పండు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. పూర్తిగా గులాబీ రంగులో ఉంటుంది. ముఖ్యంగా థాయ్‌లాండ్, శ్రీలంక, వియత్నాం, ఇజ్రాయెల్ వంటి వివిధ దేశాలలో సాగు చేస్తారు. పోషక విలువల కారణంగా ఈ పండుకు డిమాండ్ కూడా ఎక్కువే. అలాగే, మార్కెట్ ధర కూడా ఎక్కువే ఉంది. ఈ పండు మధుమేహం, కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాదు ఆర్థరైటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం. ఈ పండును చాలా సులభమైన పద్ధతిలో సాగు చేయవచ్చు. ఎక్కువ సంరక్షణ లేదా ఎరువులు అవసరం లేదు. ఈ మొక్క దాదాపు 20 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద బాగా పెరుగుతుంది. ఈ పండు పెరగడానికి అనువైన ఉష్ణోగ్రత శీతాకాలం, వేసవికాలం మధ్య ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఇసుక నేల అవసరం. ఈ మొక్క ప్రత్యేక ప్రయోజనం ఏమిటంటే ఇది తక్కువ నీటిలో కూడా జీవించగలదు.

ఇవి కూడా చదవండి

వ్యాపార పరంగా మీరు ఎంత ప్రయోజనం పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్‌లో ఈ పండు ధర కిలోకు 200-250 రూపాయలు ఉంటుంది. పండిన డ్రాగన్ ఫ్రూట్ 400 గ్రాముల బరువు ఉంటుంది. కాబట్టి కేవలం రెండు పండ్లను విక్రయించడం ద్వారా దాదాపు 200 రూపాయలు సంపాదించవచ్చు. ఒక హెక్టారు భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగుకు దాదాపు 4 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు తర్వాత ప్రతి సంవత్సరం ఆ భూమి నుండి సుమారు 8 నుండి 10 లక్షల వరకు సంపాదించవచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ