Hero EV Scooter : మరో కొత్త స్కూటర్‌ను రిలీజ్ చేస్తున్న హీరో ఎలక్ట్రిక్.. దుమ్మురేపుతున్న టీజర్

ప్పటికే ఆటోమొబైల్ రంగంలో స్థిరపడిన హీరో కంపెనీ హీరో ఎలక్ట్రిక్ పేరిట ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తుంది. అయితే ఇప్పుడు సరికొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేయనుంది. ఈ స్కూటర్‌కు సంబంధించిన టీజర్‌ను ఇప్పటికే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Hero EV Scooter : మరో కొత్త స్కూటర్‌ను రిలీజ్ చేస్తున్న హీరో ఎలక్ట్రిక్.. దుమ్మురేపుతున్న టీజర్
Hero Electric
Follow us
Srinu

|

Updated on: Mar 13, 2023 | 6:45 PM

భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు పెరిగింది. అన్ని కంపెనీలు సరికొత్త మోడల్స్‌తో ఈవీ మార్కెట్‌లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఆటోమొబైల్ రంగంలో స్థిరపడిన హీరో కంపెనీ హీరో ఎలక్ట్రిక్ పేరిట ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తుంది. అయితే ఇప్పుడు సరికొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేయనుంది. ఈ స్కూటర్‌కు సంబంధించిన టీజర్‌ను ఇప్పటికే తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ టీజర్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్‌కు సంబంధించి మరిన్ని వివరాలు మార్చి 15న రిలీజ్ చేస్తామని ఆ టీజర్‌లో కంపెనీ పేర్కొంది. అయితే ఈ కొత్త స్కూటర్‌పై అప్పుడే నెటిజన్స్ చెక్ చేయడం మొదలెట్టేశారు. ఆకట్టుకునే డిజైన్‌తో ఈ స్కూటర్ మరింత ఆకర్షిస్తుంది. ఈ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అవేంటో ఓ లుక్కెద్దాం.

హీరో ఆప్టిమాకు అప్‌డేట్ వెర్షన్‌గా..?

ప్రస్తుతం కంపెనీ రిలీజ్ చేసిన టీజర్‌ను బట్టి కొత్త స్కూటర్ హీరో ఆప్టిమాకు అప్డేట్ వెర్షన్‌గా వస్తున్నట్టు కొందరు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే హీరో రిలీజ్ చేసిన టీజర్‌లో స్కూటర్ ఇమేజ్ ఆప్టిమాలానే ఉందని పేర్కొంటున్నారు. ఆప్టిమా మోడల్ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లలో అధికంగా అమ్ముడైన ఉత్పత్తి. రాబోయే రోజుల్లో ఆప్టిమా అప్‌డేట్ వెర్షన్‌లా వస్తుందా? లేదా ఈ స్కూటర్ సరికొత్త మోడలా అని వేచి చూడాలి. ఈ స్కూటర్ మార్చి  15 లాంచ్ కానుంది. టీజర్‌ను విశ్లేషిస్తే ఫ్రంట్ కౌల్ పై భాగంలో  ఎల్ఈడీ ల్యాంప్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే హెడ్ ల్యాంప్ మధ్యలో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు ఉన్నట్లు తేలింది. టర్న్ ఇండికేటర్ డిజైన్, ఫ్రంట్ కౌల్ అచ్చం ఆప్టిమాలానే కనిపిస్తాయి. ముందు డిస్క్ బ్రేక్, కర్వ్‌డ్ సీట్లు, మందపాటి గ్రాబ్ రైల్, బ్లూపెయింట్ థీమ్‌తో అల్లాయ్ వీల్స్‌ను సులభంగా గుర్తించవచ్చు. 

రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ సూపర్ కనెక్టివిటీ ఫీచర్స్‌తో వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇతర వివరాల గురించి కంపెనీ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. ‘తెలివైన, స్థిరమైన చలనశీలతో యొక్క కొత్త శకం ప్రారంభం కానుంది’ అని హీరో తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే ఓ రెండు రోజులు వేచి ఉండాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..