Top Selling Bikes: మంచి బైక్ కొనాలనుకుంటున్నారా..? ఎక్కువగా అమ్ముడవుతున్న టాప్ 5 బ్రాండ్స్ ఏంటో తెలుసా..?

Shaik Madarsaheb

Shaik Madarsaheb |

Updated on: Mar 13, 2023 | 6:41 PM

ప్రతీఒక్కరూ బైక్ కొనాలని ఇష్టపడుతుంటారు. అలాంటి వారు ఎక్కువగా అమ్ముడవుతున్న బైక్స్ ఏంటో తెలుసుకుని.. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మీరు కూడా బైక్ లేదా స్కూటర్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఈ వార్తను ఒకసారి చదవండి..

Mar 13, 2023 | 6:41 PM
ప్రతీఒక్కరూ బైక్ కొనాలని ఇష్టపడుతుంటారు. అలాంటి వారు ఎక్కువగా అమ్ముడవుతున్న బైక్స్ ఏంటో తెలుసుకుని.. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. మీరు కూడా బైక్ లేదా స్కూటర్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నా.. మంచి కంపెనీకి చెందిన బైక్/స్కూటర్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఈ వార్తను ఒకసారి చదవండి.. దీనిలో మేము ఫిబ్రవరిలో ఎక్కువగా అమ్ముడుపోయిన టాప్ 5 ద్విచక్ర వాహనాల కంపెనీల గురించి మీకు చెప్పబోతున్నాము. మన దేశంలో ఎక్కువగా అమ్ముడుపోయిన బైక్ లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6
Hero MotoCorp: ద్విచక్ర వాహనాల విక్రయాల్లో హీరో మోటోకార్ప్ ముందంజలో ఉంది. హీరో మోటోకార్ప్ ఫిబ్రవరి 2023లో 3,82,317 యూనిట్లను విక్రయించింది. వార్షిక వృద్ధి 15.3 శాతంగా ఉంది. ఫిబ్రవరి 2022లో హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో 3,31,462 యూనిట్లను విక్రయించింది.

2 / 6
Honda: ఫిబ్రవరి 2023లో 2,27,084 యూనిట్ల విక్రయాలతో హోండా రెండో స్థానంలో నిలిచింది. హోండా యాక్టివా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తిగా నిలిచింది.

3 / 6
TVS: 2023 ఫిబ్రవరిలో TVS.. బజాజ్‌ను అధిగమించి మూడవ అతిపెద్ద ద్విచక్ర వాహనాల విక్రయ సంస్థగా అవతరించింది. ఫిబ్రవరి 2023లో దేశీయ విపణిలో TVS 2,21,402 యూనిట్లను విక్రయించింది.

4 / 6
Bajaj: బజాజ్ నాలుగో స్థానంలో కొనసాగింది. 2023 ఫిబ్రవరిలో బజాజ్ 1,18,039 యూనిట్లను విక్రయించింది. దీని అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 22 శాతం పెరిగాయి.

5 / 6
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశంలో ఐదవ అతిపెద్ద ద్విచక్ర వాహన బ్రాండ్ గా నిలిచింది.. 2023 ఫిబ్రవరిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 64,436 యూనిట్లను విక్రయించింది, దాని అమ్మకాలలో వార్షిక వృద్ధి 23.5 శాతం నమోదు చేసింది.

6 / 6

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu