Hero Electric Scooter: హీరో కంపెనీ నుంచి కొత్త ఈవీ స్కూటర్… లైసెన్స్ లేకుండానే సూపర్ రైడింగ్ ఎక్స్‌పీరియన్స్
పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులను టార్గెట్ చేస్తూ హీరో కంపెనీ కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎడ్డీ పేరుతో తీసుకొచ్చిన ఈ బైక్ పెరుగుతున్న ఇందన ధరల నుంచి వినియోగదారులను రక్షిస్తుందని పేర్కొంటున్నారు.
భారత్‌లో పెరుగుతున్న ఈవీ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని కంపెనీలు సరికొత్త ఈవీ వెహికల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. ఇదే కోవలో పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులను టార్గెట్ చేస్తూ హీరో కంపెనీ కొత్త మోడల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎడ్డీ పేరుతో తీసుకొచ్చిన ఈ బైక్ పెరుగుతున్న ఇందన ధరల నుంచి వినియోగదారులను రక్షిస్తుందని పేర్కొంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో తక్కువ దూరాలకు ప్రయాణిస్తూ ఉంటారు. అర్బన్ మొబిలిటీ ఎలక్ట్రిక్ టూ-వీలర్లలో ఈ స్కూటర్ తన ప్రత్యేకత చాటుకుంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మెట్రో సీటీలు లేదా చిన్న పట్టణాల్లో స్థానికంగా ప్రయాణించడానికి ఈ స్కూటర్ అనువుగా ఉంటుంది.
నో రిజిస్ట్రేషన్, నో లైసెన్స్
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రిజిస్టర్ చేయాల్సిన న అవసరం ఉండదు. అలాగే దీన్ని నడపడానికి లైసెన్స్ కూడా అవసరం లేదు. రూ. 72,000 ఎక్స్-షోరూమ్ ధరతో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ స్కూటర్‌కు ఫేమ్ సబ్సిడీలు రావు. ఈ స్కూటర్ర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు మాత్రమే పరిమితం చేశారు. అలాగే ఓ సారి చార్జ్ చేస్తే 85 కిలో మీటర్లకు మైలేజ్ ఇస్తుంది. ముఖ్యంగా చిన్న ప్రయాణాలకు మాత్రమే ఉపయోగించే చాలా మంది రైడర్‌లకు సరిపోయేలా ఉంది. హీరో ఎడ్డీ బేసిక్ స్కూటర్ కాదు. అయితే దీనికి రివర్స్ మోడ్, ఫాలో మీ హెడ్‌ల్యాంప్, ఇ-లాక్, ఫైండ్ మై బైక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. నీలం, పసుపు రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అయితే హోండా యాక్టివా లేదా సుజుకి యాక్సెస్ వంటి వాటితో పోలిస్తే ఎడ్డీ స్కూటర్ ధర విషయంలో కొంచెం ఎక్కువగానే అనిపిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే చిన్న పర్యావరణ అనుకూల రవాణా పరిష్కారాల కోసం ఈ స్కూటర్ చక్కని ఎంపికగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..