Telangana: ఒంటి పూట బడులు, వేసవి సెలవుల షెడ్యూల్ వచ్చేసిందోచ్
తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడుప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందింది.

తెలంగాణలో ఒంటి పూట బడులకు వేళయ్యింది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో సర్కారు, ప్రైవేటు స్కూళ్లలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ప్రతిరోజూ ఉదయం 7.45 గంటల నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకూ తరగతులు నిర్వహించనున్నారు. 2022-23 విద్యా సంవత్సరం చివర పని దినం ఏప్రిల్ 24 వరకూ అన్ని స్కూళ్లు ఇదే టైమ్ టేబుల్ ఫాలో కావాల్సి ఉంటుంది. వేసని నేపథ్యంలో అన్ని స్కూళ్లలో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని విద్యాశాఖ సూచించింది.
అయితే, 10వ తరగతి విద్యార్థలు విషయంలో మాత్రం కొంత మినహాయింపు ఇచ్చింది విద్యాశాఖ. పబ్లిక్ ఎగ్జామ్స్ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో వారికి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకూ వేసవి సెలవులు ఉంటాయి. మొత్తం 48 రోజుల పాటు విద్యార్థులకు వేసవి సెలవులు ఉండనున్నాయి. తిరిగి పాఠశాలలు జూన్ 12న పాఠశాలలు రీ ఓపెన్ అవ్వనున్నాయి. అకడమిక్ ఇయర్ గైడ్ లైన్స్ ప్రకారమే ఈ షెడ్యూల్ నడుస్తుందని అధికారులు చెప్తున్నారు. 1 నుంచి 9 తరగతులకు ఏప్రిల్ 12 నుంచి ఎగ్జామ్స్ ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 1-5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే ఉండడంతో వారికి ఏప్రిల్ 17తో పరీక్షలు ముగియనున్నాయి. ఇక 6 నుంచి 9 క్లాసెస్ వారికి ఏప్రిల్ 20 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. పరీక్షా ఫలితాలు ఏప్రిల్ 21న వెల్లడించి రికార్డుల్లో పొందుపరచాలని విద్యాశాఖ సూచించింది. ఏప్రిల్ 24న పెరెంట్స్ మీటింగ్ పెట్టి విద్యార్థుల పురోభివృద్ధిపై చర్చించాలని, ప్రిన్సిపల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
