AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kollam Doctor Murder: వైద్యం కోసం వచ్చి డాక్టర్‌ను హత్య చేసిన నేరస్తుడు.. కేరళలో దారుణం..

మద్యం మత్తులో కుటుంబసభ్యులతో గొడవ పడ్డ సందీప్‌ అనే వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. కాలికి గాయం కావడంతో వందనాదాస్‌ అనే డాక్టర్‌ అతడికి ట్రీట్‌మెంట్‌ చేశారు. కాలికి బ్యాండేజ్‌ కడుతున్న సమయంలో సడెన్‌గా వందనాదాస్‌పై కత్తితో దాడి చేశాడు సందీప్‌. ఈ దాడిలో వందనాదాస్‌కు తీవ్రగాయాలయ్యాయి.

Kollam Doctor Murder: వైద్యం కోసం వచ్చి డాక్టర్‌ను హత్య చేసిన నేరస్తుడు.. కేరళలో దారుణం..
Kerala Woman Doctor Stabbed
Sanjay Kasula
|

Updated on: May 10, 2023 | 2:06 PM

Share

కేరళలో దారుణం జరిగింది. వైద్యం కోసం వచ్చిన ఓ వ్యక్తి లేడీ డాక్టర్‌ను హత్య చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. కొట్టరక్కర పీఎస్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో కుటుంబసభ్యులతో గొడవ పడ్డ సందీప్‌ అనే వ్యక్తిని పోలీసులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. కాలికి గాయం కావడంతో వందనాదాస్‌ అనే డాక్టర్‌ అతడికి ట్రీట్‌మెంట్‌ చేశారు. కాలికి బ్యాండేజ్‌ కడుతున్న సమయంలో సడెన్‌గా వందనాదాస్‌పై కత్తితో దాడి చేశాడు సందీప్‌. ఈ దాడిలో వందనాదాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. ట్రీట్‌మెంట్‌ కోసం త్రివేండ్రం తరలించగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. ఉన్మాది సందీప్‌ దాడిలో మరో నలుగురికి గాయాలయ్యాయి.

వందనాదాస్‌ హత్యకు నిరసనగా కేరళలో ఆందోళనలు మిన్నంటాయి. వైద్యవిద్యార్ధులు క్లాస్‌లను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రిలో వందనాదాస్‌ మృతదేహానికి గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ఖాన్‌ , సీఎం విజయన్‌ నివాళి అర్పించారు.

కొట్టారక్కర తాలూకా ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిని కత్తితో పొడిచి చంపిన కేసులో ఈరోజు హైకోర్టులో ప్రత్యేక విచారణ జరిగింది. న్యాయమూర్తులు దేవన్ రామచంద్రన్, కౌసర్ ఎడప్పగత్‌లతో కూడిన డివిజన్ బెంచ్ మధ్యాహ్నం 1.45 గంటలకు సిట్టింగ్‌ను నిర్వహించనుంది. వేసవి సెలవులు కావడంతో అత్యవసర పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక సిట్టింగ్‌ను ఏర్పాటు చేశారు.

ఈ ఘటన నేపథ్యంలో వైద్య విద్యార్థులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇంటర్న్‌లు, హౌస్ సర్జన్లకు భద్రత కల్పించాలి. ఆరోగ్య కార్యకర్తలకు కల్పిస్తున్న భద్రతను ఆసుపత్రిలో పనిచేస్తున్న విద్యార్థులకు కూడా కల్పించాలని వినతిపత్రంలో కోరారు.

దీనిపై స్వయంగా కేసు న మోదు చేసిన హ్యూమన్ రైట్స్ కమిష న్.. దీనిపై విచార ణ చేసి వారం రోజుల్లో నివేదిక అందించాలని జిల్లా ప్ర ధానిని ఆదేశించింది. ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ కేసుకు సంబంధించిన ఘటన చోటుచేసుకుంది. దాడి కేసులో కస్టడీకి వచ్చిన పూయపల్లికి చెందిన సందీప్.. పని చేస్తున్న మహిళా వైద్యుడిని కత్తితో పొడిచి హత్య చేశాడు. కొట్టాయంకు చెందిన డాక్టర్ వందనా దాస్ మరణించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం