AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MUDA Scam: కర్ణాటక సీఎం భార్యకు అప్పనంగా భూములు..? రాత్రంతా అసెంబ్లీలోనే బీజేపీ ధర్నా

ముడా స్కాం కర్ణాటక అసెంబ్లీని కుదిపేస్తోంది. ఉభయసభల్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టింది భారతీయ జనతా పార్టీ. కానీ విపక్షాలను అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్‌ అనుమతించలేదు. దీంతో సభ్యులు విధానసభలోనే ధర్నాకు దిగారు. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ - ముడాలో భూములు కోల్పోయిన వారికి స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు చేశారు.

MUDA Scam: కర్ణాటక సీఎం భార్యకు అప్పనంగా భూములు..? రాత్రంతా అసెంబ్లీలోనే బీజేపీ ధర్నా
Karnataka Opposition Leaders
Balaraju Goud
|

Updated on: Jul 25, 2024 | 8:38 AM

Share

ముడా స్కాం కర్ణాటక అసెంబ్లీని కుదిపేస్తోంది. ఉభయసభల్లో ఈ అంశంపై చర్చకు పట్టుబట్టింది భారతీయ జనతా పార్టీ. కానీ విపక్షాలను అసెంబ్లీ స్పీకర్‌, మండలి చైర్మన్‌ అనుమతించలేదు. దీంతో సభ్యులు విధానసభలోనే ధర్నాకు దిగారు. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ – ముడాలో భూములు కోల్పోయిన వారికి స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు చేశారు. 4వేల కోట్ల కుంభకోణం దీని వెనుక దాగి ఉందని బీజేపీ సభ్యులు ఆరోపణలు చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్యకు అప్పనంగా భూములు ఇచ్చేశారంటూ మండిపడ్డారు.

ఉభయ సభల్లో ఈ అంశంపై చర్చించేందుకు విపక్షాలు పట్టుబట్టాయి. కానీ.. గందరగోళం మధ్యే ఆర్థిక బిల్లుకు అమోదం తెలిపి సభను వాయిదా వేశారు కర్ణాటక అసెంబ్లీ స్పీకర్. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన భార్య పార్వతికి 14 స్థలాలను చట్టబద్ధంగా ఇచ్చారని నిరూపించాలని, బీజేపీ పక్ష నేత ఆర్‌ అశోక డిమాండ్‌ చేశారు. దళితుల భూములను లూటీ చేసి, తన భార్యకు అప్పగించారని ఆరోపించారు. స్పీకర్‌ అధికార పక్షానికి వత్తాసు పలుకుతూ తమను మాట్లాడనివ్వడం లేదని మండిపడ్డారు. తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీలోనే పగలూ రాత్రి ధర్నాకు కూర్చుంటున్నామరి ఆర్‌ అశోక తెలిపారు.

నిజానికి ముడా సీఎం సతీమణి పార్వతికి సంబంధించిన మూడు ఎకరాల స్థలాన్ని తీసుకుని, 50:50 నిష్పత్తిలో భూములను కేటాయించింది కర్ణాటక ప్రభుత్వం. అయితే ఆమె దగ్గర్నుంచి తీసుకున్న భూమి ధరకన్నా.. ఇచ్చిన ప్లాట్ల ధర ఎంతో ఎక్కువ అని ఆరోపించింది బీజేపీ. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. మరోవైపు, ముడా స్కాం ఆరోపణలపై రిటైర్డ్‌ జడ్జ్‌తో విచారణకు ఆదేశించింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. పీఎన్‌ దేశాయ్‌ నేతృత్వంలో ఈ విచారణ జరుగుతుందని సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రకటించింది. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీలోనే ఉండి రాత్రంతా ధర్నా నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…