Diamond: ఒక్క రోజులో జీవితం మారడం అంటే ఇదే.. రూ. 80 లక్షల విలువైన..

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన రాజు గౌడ్‌ అనే గౌఢ్‌ అనే వ్యక్తి గతంలో ట్రాక్టర్‌ నడుపుతూ జీవనం సాగించేవాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే ఏదో ఒక రోజు జీవితం మారకపోతుందా. అన్న చిన్న ఆశతో జీవితాన్ని గడిపేవాడు. చిన్నపాటి గనులను లీజుకు తీసుకొని పనిచేస్తూ వచ్చాడు. అయితే ఇదే సమయంలో రెండు నెలల క్రితం ఓ గనిని...

Diamond: ఒక్క రోజులో జీవితం మారడం అంటే ఇదే.. రూ. 80 లక్షల విలువైన..
Diamond
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 25, 2024 | 10:53 AM

ఒక్క రోజులో జీవితం మారిపోవాలని చాలా మంది ఆశిస్తుంటారు. అయితే దీనికి ఎంతో అదృష్టం కలసిరావాలి. అలాంటి అదృష్టమే ఓ వ్యక్తికి కలిసొచ్చింది. ఒక్క రోజులోనే లక్షాధికారి అయ్యాడు. కూలీ పనిచేసుకుంటూ జీవితం సాగిస్తున్న వ్యక్తి తలరాతే మారిపోయింది. ఇంతకీ ఎవరా వ్యక్తి.? ఆ అదృష్టం ఎలా కలిసొచ్చిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందిన రాజు గౌడ్‌ అనే గౌఢ్‌ అనే వ్యక్తి గతంలో ట్రాక్టర్‌ నడుపుతూ జీవనం సాగించేవాడు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే ఏదో ఒక రోజు జీవితం మారకపోతుందా. అన్న చిన్న ఆశతో జీవితాన్ని గడిపేవాడు. చిన్నపాటి గనులను లీజుకు తీసుకొని పనిచేస్తూ వచ్చాడు. అయితే ఇదే సమయంలో రెండు నెలల క్రితం ఓ గనిని లీజుకు తీసుకున్నాడు. అయితే ఈ గనిని తవ్వుతున్న సమయంలో వజ్రం దొరికింది.

రాజు గౌఢ్‌కు 19.33 క్యారెట్‌ డైమండ్‌ దొరికింది. ప్రభుత్వ వేలంలో ఈ డైమండ్‌కు ఏకంగా రూ. 80 లక్షలు రావడం విశేషం. ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌ సురేష్‌ కుమార్‌ స్పందించారు. వేలంలో ఈ డైమండ్‌కు రూ. 80 లక్షల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వజ్రాల వేలంలో దీన్ని బహిరంగ బిడ్డింగ్‌కు ఉంచనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

ఇలాంటి ఊహకందని అదృష్టం కలిసి రావడంతో రాజు గౌఢ్ కుటుంబ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తనకు వచ్చే డబ్బుతో ఆర్థిక కష్టాలు దూరమవుతాయని. పిల్లల చదువుకు ఈ డబ్బును ఉపయోగిస్తానని రాజు గౌఢ్‌ చెప్పుకొచ్చారు. అలాగే ఒక వ్యవసాయ భూమిని కొనుగోలు చేస్తానని తెలిపారు. కాగా ఈ వజ్రాన్ని ప్రభుత్వ అధికారుల వద్ద జమ చేయగా త్వరలోనే వేలంపాట నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..