Telugu News India News Karnataka Amul Nandini Row: Congress Leader Rahul Gandhi Visits Local Brand's Milk Parlour, Calls It Pride Of State
Karnataka Election: ‘కర్ణాటక గర్వం.. నందిని ఈజ్ ది బెస్ట్’.. మిల్క్ పార్లర్‌కు వెళ్లి ఐస్‌క్రీం తిన్న రాహుల్ గాంధీ..
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు.. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అధికార, విపక్ష పార్టీల మాటలతో కన్నడ రాజకీయం వేడెక్కుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు.. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అధికార, విపక్ష పార్టీల మాటలతో కన్నడ రాజకీయం వేడెక్కుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న కోలార్‌లో జరిగిన సభకు హాజరైన రాహుల్ గాంధీ హామీల వర్షం కురిపించారు. అనంతరం రాహుల్ గాంధీ మిల్క్ పార్లర్ కు వెళ్లి ఐస్ క్రీం తిన్నారు. తింటే తిన్నారు.. కానీ.. ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడ రాజకీయాల్లో మరింత చర్చనీయాంశంగా మారాయి. అయితే, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు వేళ పాల ఉత్పత్తి సంస్థలైన నందిని – అమూల్ మధ్య రగడ.. కాస్త రాజకీయ రంగు పులుముకున్న విషయం తెలిసిందే. బెంగళూరులో తమ పాల ఉత్పత్తులను సరఫరా చేస్తామని అమూల్ ప్రకటించడంతో రెండు సంస్థల మధ్య వివాదం మొదలైంది. అయితే, కర్ణాటకలో అమూల్ ఎంట్రీని విపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి.
నందిని వర్సెస్ అమూల్ యుద్ధం మధ్యలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం నందిని ఐస్‌క్రీమ్‌ను కొనుగోలు చేసి, “కర్ణాటక గర్వించదగ్గ బ్రాండ్” అంటూ పేర్కొన్నారు. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ అయిన నందినిని “ఉత్తమమైనది” అని కూడా కితాబిచ్చారు. గుజరాత్‌కు చెందిన అమూల్ స్వాధీనం చేసుకుంటుందనే భయంతో రాష్ట్ర పార్టీ నాయకులు స్వదేశీ పాల బ్రాండ్‌కు మద్దతు ఇవ్వడంతో రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. న్యూస్ ఏజెన్సీ ANI పోస్ట్ చేసిన వీడియోలో.. స్టోర్‌లో రాష్ట్ర పార్టీ చీఫ్ డీకే శివకుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్‌తో కలిసి రాహుల్ ఐసీక్రీం తింటూ కనిపించారు. ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో గాంధీ రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. ఆ తర్వాత మాజీ ఎంపీ ట్విట్టర్‌లో తన ఫోటోకు క్యాప్షన్ పెట్టి, “కర్ణాటక గర్వం – నందిని ఈజ్ ది బెస్ట్” అంటూ పేర్కొన్నారు.
#KarnatakaAssemblyElections | Amid row over the entry of Amul in the state, Congress leader Rahul Gandhi, state party chief DK Shivakumar and general secretary KC Venugopal visited Nandani Milk parlour in JP Nagar, Bengaluru. pic.twitter.com/JzfJrTP5uf
గతంలో ఎన్నికల ప్రచారంలో శివకుమార్ నందిని స్టోర్‌లో పాల ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఈ బ్రాండ్ కర్ణాటకలో రైతుల ఆత్మగౌరవానికి ప్రాతినిధ్యం వహిస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. కర్నాటకలో అమూల్‌ను అనుమతించడం నందినిని ‘చంపడమే’ అంటూ ప్రతిపక్ష నాయకులు పేర్కొన్నారు. కాగా, ప్రతిపక్షాల విమర్శలపై బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. అమూల్ నందినికి ఎటువంటి ముప్పు లేదని పేర్కొంది.