AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Elections 2024: వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.. రాహుల్ గాంధీపై విరుచుకుపడిన దేవెగౌడ

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షులు హెచ్ డీ దేవెగౌడ విరుచుకుపడ్డారు. కర్ణాటకలోని హసన్‌లో విలేకరుల సమావేశంలో ప్రసంగించిన హెచ్‌డి దేవెగౌడ, దేశ వనరులు, పంపిణీపై హక్కులు అనే అంశంపై రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను విమర్శించారు.

Lok Sabha Elections 2024: వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.. రాహుల్ గాంధీపై విరుచుకుపడిన దేవెగౌడ
Rahul Gandhi, Deve Gowda
Basha Shek
|

Updated on: Apr 24, 2024 | 10:26 PM

Share

రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ అధ్యక్షులు హెచ్ డీ దేవెగౌడ విరుచుకుపడ్డారు. కర్ణాటకలోని హసన్‌లో విలేకరుల సమావేశంలో ప్రసంగించిన హెచ్‌డి దేవెగౌడ, దేశ వనరులు, పంపిణీపై హక్కులు అనే అంశంపై రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను విమర్శించారు. ఇది ఇద్దరు మాజీ కాంగ్రెస్‌ ప్రధానమంత్రులను అవమానించడమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత మేనిఫెస్టో పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ల దార్శనికతకు విరుద్ధంగా ఉందని దేవేగౌడ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో అనేక హామీలను ప్రస్తావించింది. ఎప్పటికీ అధికారంలోకి రాని పార్టీ మాత్రమే ఇలాంటి వాగ్దానాలు చేయగలదని ఈ మేనిఫెస్టో చూపిస్తుంది. ఈ దేశాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లాలని, ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

‘రాహుల్ గాంధీ సర్వే చేసి ఆస్తుల సమాన పంపిణీని కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ మావోయిస్టు నాయకుడని నమ్ముతున్నారా? వారు ఏదైనా విప్లవం గురించి కలలు కంటున్నారా? ఇది ఆచరణాత్మకంగా సాధ్యమేనా?రాహుల్ గాంధీ ప్రకటన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ప్రధానులను అవమానించేలా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో యువతకు 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. దేశాన్ని కూడా నడిపించాం. దేశంలో మొత్తం 40 లక్షల ఉద్యోగాలు మంజూరు చేయబడ్డాయి. రాత్రికి రాత్రే 30 లక్షల కొత్త ఉద్యోగాలను ఎక్కడికి తెస్తారు? అంటే వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. కేంద్ర ప్రభుత్వంలో యువతకు 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. దేశాన్ని కూడా నడిపించాం. దేశంలో మొత్తం 40 లక్షల ఉద్యోగాలు మంజూరు చేయబడ్డాయి. రాత్రికి రాత్రే 30 లక్షల కొత్త ఉద్యోగాలను ఎక్కడికి తెస్తారు? అంటే వారికి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు’ అని రాహుల్ కు చురకలంటించారు దేవే గౌడ.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..