AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు..

లిక్కర్‌ స్కామ్ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్‌లో పెట్టింది. మే 6వ తేదీన తీర్పు వెల్లడిస్తామని రౌస్‌ అవెన్యూ కోర్టు తెలిపింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత బెయిల్‌ పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‎పై గత మూడు రోజుల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో మే 6 తేదీన తీర్పు వెల్లడించనుంది.

కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు..
Kavitha
Srikar T
|

Updated on: Apr 24, 2024 | 7:47 PM

Share

లిక్కర్‌ స్కామ్ కేసులో కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్‌లో పెట్టింది. మే 6వ తేదీన తీర్పు వెల్లడిస్తామని రౌస్‌ అవెన్యూ కోర్టు తెలిపింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత బెయిల్‌ పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో వాడి వేడి వాదనలు జరిగాయి. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్‎పై గత మూడు రోజుల పాటు కోర్టులో వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో మే 6 తేదీన తీర్పు వెల్లడించనుంది. కవిత బెయిల్ పిటిషన్‎పై కోర్టులో విచారణ జరగగా ఈడీ తన వాదనలను వినిపించింది . సెక్షన్ 19 కింద కవితను చట్టబద్ధంగా అరెస్టు చేశామని, అక్రమంగా అరెస్ట్ చేశామని వారు చెబుతున్న దానిలో ఏమాత్రం వాస్తవం లేదని ఈడీ పేర్కొంది. దాదాపు రెండు గంటలపాటు ఈడీ తమ వాదనను వినిపించింది. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని వెల్లడించింది. లిక్కర్‌ స్కాంతో ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరిగిందని పేర్కొన్న ఈడీ రూ.581 కోట్లు హోల్ సేల్ వ్యాపారులు సంపాదించారని, ఐదు నుంచి 12 శాతానికి కమిషన్ పెంచారని పేర్కొన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీకి కవిత రూ.100 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని, ఆందుకే ఈ కేసులో ఈమె కీలక భూమిక పోషించారని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నిందితుల నుండి అనేక సాక్ష్యాలు దొరికాయని, కవిత ఈడీ అధికారులకు ఇచ్చిన తొమ్మిది ఫోన్లలోనూ డేటా డిలీట్ చేశారని, ఎందుకు డిలీట్ చేశారంటే కవిత సమాధానం చెప్పలేదని పేర్కొన్నారు. కవిత ఫోన్‎లను పని మనుషులకు ఇచ్చారని, వారిని విచారణ జరిపితే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని, పనిమనుషులు డేటా ఎందుకు డిలీట్ చేస్తారంటూ ప్రశ్నించారు. సాక్షాలను ధ్వంసం చేయడమే కాకుండా సాక్షులను కవిత బెదిరించారని, కవితకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, బెయిల్ ఇవ్వద్దని ఢిల్లీ కోర్టులో బలంగా వాదించింది ఈడీ. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు రిజర్వ్ చేసి మే 6వ తేదీన తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది. ఇదిలా ఉంటే ఇప్పటికే కవితకు కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ మే 6 వరకు పొడిగించింది. దీంతో పాటు సీబీఐ కూడా కవితను అరెస్ట్ చేసి విచారణ చేపట్టింది. గతంలోనూ తమ విచారణకు సహకరించలేదని సీబీఐ పేర్కొంది. ఈ క్రమంలోనే ఆమె వేసిన బెయిల్ పిటిషన్ గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!