Jamaat-e-Islami: ఎప్పుడో నిషేధించబడిన ఆ తీవ్రవాద సంస్థపై కాశ్మీర్ అధికారుల దాడి.. ఎంత నగదును స్వాధీనం చేసుకున్నారంటే..?

దేశంలోని నిషేధిత అతిపెద్ద రాజకీయ, మత సంస్థ ఇస్లామిస్ట్ గ్రూప్ జమాత్-ఇ-ఇస్లామీకి చెందిన దాదాపు ₹ 90 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర దర్యాప్తు సంస్థ..

Jamaat-e-Islami: ఎప్పుడో నిషేధించబడిన ఆ తీవ్రవాద సంస్థపై కాశ్మీర్ అధికారుల దాడి.. ఎంత నగదును స్వాధీనం చేసుకున్నారంటే..?
Sia
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 28, 2022 | 6:49 AM

దేశంలోని నిషేధిత అతిపెద్ద రాజకీయ, మత సంస్థ ఇస్లామిస్ట్ గ్రూప్ జమాత్-ఇ-ఇస్లామీకి చెందిన దాదాపు ₹ 90 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. వేర్పాటువాదం, తీవ్రవాద కార్యకలాపాలను పెంచి పోషిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఇస్లామిక్ సంస్థపై కొనసాగుతున్న దాడులలో భాగంగా అధికారులు ఈ ఆపరేషన్ చేపట్టారు. షోపియాన్ జిల్లాలో జమాతే ఇస్లామీ సంస్థకు చెందిన రెండు పాఠశాలలతో సహా తొమ్మిది ప్రాంతాలకు నవంబర్ నెల ప్రారంభంలో దర్యాప్తు సంస్థ అధికారులు నోటీసులు పంపి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం(ఉపా) ప్రకారం ఈ ఆస్తులను జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకువెళ్లారు అధికారులు.

అనంతనాగ్ జిల్లా మేజిస్ట్రేట్ నుంచి అనుమతి పొందిన తరువాత.. దర్యాప్తు సంస్థ అధికారులు భారీ పోలీసు బలగాలతో కలిసి 11 ఆస్తులపై దాడి చేసి అధికారికంగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్వాధీనపరుచుకున్న అస్తుల విలువ వంద కోట్లకు పైగా ఉండవచ్చని, దీనికి చెందిన సంపదలు జమ్మూకాశ్మీర్‌లోని ప్రతి జిల్లాలో ఉన్నాయని దర్యాప్తు సంస్థ అధికారులు అంటున్నారు. జమాతే సంస్థకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకున్న తర్వాత ‘‘విభజన కార్యకలాపాల కోసం నిధులసరఫరా కావడం అనేది దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇంకా ఇవి భారత సార్వభౌమాధికారానికి విరుద్ధమైన దేశ వ్యతిరేక కార్యక్రమాలు’’ అని దర్యాప్తు సంస్థ(SIA) పేర్కొంది.

అయితే, కాశ్మీర్‌లోని అతి పెద్ద మత రాజకీయ సంస్థ అయిన జమాత్-ఇ-ఇస్లామీ సంస్థను 2019 సంవత్సరంలో నిషేధించింది. నిషేధానికి ముందు ఈ సంస్థ స్థానికంగా పాఠశాలలు, ఇతర సామాజిక మౌలిక సదుపాయాలతో భారీ నెట్‌వర్క్‌నే కలిగి ఉండేది. కాగా హిజ్బుల్ ముజాహిదీన్‌ను సైద్ధాంతిక గురువు భావించే జమాతే ఇస్లామీ సంస్థపై తీవ్రవాదాన్ని పెట్టి పోషిస్తోందన్న పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థ 1990లలో కాశ్మీర్‌లో అతిపెద్ద స్వదేశీ ఉగ్రవాద సంస్థగా ఉండేది. .

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..