Bridge Collapse WATCH: మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వేస్టేషన్‌లో పాక్షికంగా కూలిపోయిన రైల్వే ఫుట్‌ఓవర్ బ్రిడ్జి.. 60 అడుగు ఎత్తు నుంచి కిందపడిన ప్రయాణికులు..
మహారాష్ట్రలోని బల్హర్షా రైల్వే స్టేషన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి కొంత భాగం కూలిపోవడంతో పెను ప్రమాదం సంభవించింది.
మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లోని బల్హర్షా రైల్వే స్టేషన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిలో కొంత భాగం కూలింది. ఆదివారం (నవంబర్ 27) జరిగిన ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనలో సుమారు 10-15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రయాణికులు దాదాపు 60 అడుగుల ఎత్తు నుంచి వంతెనపై నుంచి ట్రాక్‌పై పడిపోయారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది ప్రయాణికులు ట్రాక్ దాటుతున్నట్లు మీడియాలో చూడచ్చు. ఈ ఫుట్‌ఓవర్ వంతెన ఒకటి, రెండు ప్లాట్‌ఫారమ్‌లను కలుపుతుంది.
సీపీఆర్వో ప్రకటన..
ఈరోజు సాయంత్రం 5.10 గంటల ప్రాంతంలో నాగ్‌పూర్ డివిజన్‌లోని బల్హర్షా వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి ప్రీ-కాస్ట్ స్లాబ్‌లో కొంత భాగం కూలిపోయిందని సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శివాజీ సుతార్ తెలిపారు. ఈ ఘటనలో 4 మందికి గాయాలు కాగా, ప్రథమ చికిత్స అనంతరం అందరినీ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
#WATCH | Slabs fall off of a foot over bridge at Balharshah railway junction in Maharashtra’s Chandrapur; people feared injured pic.twitter.com/5VT8ry3ybe
— ANI (@ANI) November 27, 2022
రైల్వే పరిహారం..
తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, మధ్యస్థంగా గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్‌గ్రేషియాను రైల్వేశాఖ ప్రకటించిందని సీపీఆర్వో తెలిపారు. క్షతగాత్రులను త్వరగా కోలుకునేందుకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం