SAIL Bhilai Jobs 2022: స్టీల్ ప్లాంట్‌లో ఆ ఉద్యోగాలకు ప్రారంభమైన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. నెలకు రూ. 2 లక్షలకుపైగా జీతం..
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలోని భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో 259 సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్/సీనియర్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది..
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిధిలోని భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో 259 సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్/సీనియర్ మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/ఐటీఐ/బీఈ/బీటెక్/ఎంబీబీఎస్/డీఎం/డీఎన్‌బీ/ఎంసీహెచ్/పీజీ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన అభ్యర్ధులు ఎవరైనా డిసెంబర్ 17, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 28 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఐతే దరఖాస్తు సమయంలో మెడికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.500, పారామెడికల్ స్టాఫ్ పోస్టులకు రూ.250 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. మిగిలిన కేటగిరీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.25,070ల నుంచి రూ.2.4 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
విభాగాల వారీగా ఖాళీలు..
- సీనియర్ కన్సల్టెంట్ పోస్టులు: 2
- కన్సల్టెంట్/సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 8
- మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 6
- డిప్యూటీ మేనేజర్ పోస్టులు: 2
- అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు: 22
- మైన్స్ ఫోర్‌మెన్ పోస్టులు: 16
- సర్వేయర్ పోస్టులు: 4
- ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టులు: 79
- మైనింగ్ మేట్ పోస్టులు: 17
- బ్లాస్టర్ పోస్టులు: 17
- అటెండెంట్ కమ్ టెక్నీషియన్ పోస్టులు: 78
- ఫైర్‌మ్యాన్ కమ్ ఫైన్ ఇంజనీరింగ్ డ్రైవర్ పోస్టులు: 8
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.