Currency Note Press Jobs 2022: నెలకు రూ.95 వేల జీతంతో కరెన్సీ నోట్ల ముద్రణ కార్యాలయంలో 125 ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు..
మహారాష్ట్రకు చెందిన నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్.. 125 సూపర్‌వైజర్, జూనియర్ టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
మహారాష్ట్రకు చెందిన నాసిక్‌లోని కరెన్సీ నోట్ ప్రెస్.. 125 సూపర్‌వైజర్, జూనియర్ టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ, ఎలక్ట్రికల్/ప్రింటింగ్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ఎయిర్ కండీషనింగ్/ఎన్విరాన్‌మెంట్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/మెషిన్ మైండర్/లెటర్ ప్రెస్ మెషిన్ మెషిన్ మైండర్/ఆఫ్‌సెట్ ప్రింటింగ్/ప్లేట్ మేకింగ్/ఎలక్ట్రో ప్లాటింగ్ తదితర విభాగాల్లో డిప్లొమా, ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్ 16, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్ అభ్యర్ధులు రూ.600, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు రూ.200లు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ రాత పరీక్ష 2023 జనవరి/ఫిబ్రవరి నెలల్లో నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.18,780ల నుంచి రూ.95,910ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- సూపర్‌వైజర్ (టెక్నికల్ ఆపరేటర్- ప్రింటింగ్) పోస్టులు: 10
- సూపర్‌వైజర్ (టెక్నికల్ ఆపరేటర్- ఎలక్ట్రికల్) పోస్టులు: 2
- సూపర్‌వైజర్ (టెక్నికల్ ఆపరేటర్- ఎలక్ట్రానిక్స్) పోస్టులు: 2
- సూపర్‌వైజర్ (టెక్నికల్ ఆపరేటర్- మెకానికల్) పోస్టులు: 2
- సూపర్‌వైజర్ (టెక్నికల్ ఆపరేటర్- ఎయిర్ కండిషనింగ్) పోస్టులు: 1
- సూపర్‌వైజర్ (ఐటీ) పోస్టులు: 4
- జూనియర్ టెక్నీషియన్(ప్రింటింగ్/ కంట్రోల్) పోస్టులు: 103
రాత పరీక్ష విధానం..
మొత్తం 200ల మార్కులకు 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 120 నిముషాల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.