AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Police Events: పోలీస్‌ ఈవెంట్స్‌కి హాజరువుతున్నారా.? ఈ టిప్స్‌ పాటిస్తే మీకు తిరుగే ఉండదు..

తెలంగాణ పోలీసు నియామకాల కోసం రాత పరీక్షలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిసెంబర్‌లో ఈవెంట్స్‌ను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 8 తేదీ నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్ శారీరక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక బోర్డ్ (టీఎస్ఎల్ పీఆర్ బీ) ఆదివారం..

Police Events: పోలీస్‌ ఈవెంట్స్‌కి హాజరువుతున్నారా.? ఈ టిప్స్‌ పాటిస్తే మీకు తిరుగే ఉండదు..
Ts Police Events
Narender Vaitla
|

Updated on: Nov 27, 2022 | 5:32 PM

Share

తెలంగాణ పోలీసు నియామకాల కోసం రాత పరీక్షలు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిసెంబర్‌లో ఈవెంట్స్‌ను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 8 తేదీ నుంచి ఎస్ఐ, కానిస్టేబుల్ శారీరక పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక బోర్డ్ (టీఎస్ఎల్ పీఆర్ బీ) ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు డిసెంబర్ 8వ తేదీ నుంచి పీఎంటీ, పీఈటీ టెస్టులు నిర్వహించనున్నారు. అభ్యర్థులు నవంబర్ 29న ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 3వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. ఇదిలా ఉంటే పోలీస్‌ నియామక ప్రక్రియలో ఈవెంట్స్‌ ఎంతో కీలకమనే విషయం తెలిసిందే. ఈవెంట్స్‌ పాల్గొనే అభ్యర్థులు కొన్ని చిట్కాలను పాటిస్తే సులభంగా విజయాన్ని సాధించవచ్చు. ఇంతకీ ఆ టిప్స్‌ ఏంటేంటే..

* ఈవెంట్స్‌లో పాల్గొనే అభ్యర్థులు మంచి షూలను ఉపయోగించాలి. రన్నింగ్ చేసే సమయంలో కంఫర్ట్‌గా ఉండే బ్రాండెడ్‌ స్పోర్ట్స్‌ షూలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పరిగెత్తే సమయంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

* ప్రాక్టిస్‌ చేసే సమయంలో షర్ట్‌లు కాకుండా టీషర్ట్స్‌ను ధరించండి. సాధారణంగా షర్ట్స్‌ వేసుకుంటే గాలి సరిగ్గా ఆడక చెమట పడుతుంది. దీంతో త్వరగా ఆలిసిపోయే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

* ఇక ఈవెంట్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. వీటివల్ల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

* తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. రోజూ ఉడికించిన గుడ్లు, డ్రూఫూట్స్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. త్వరగా జీర్ణమయ్యే ఆహారినికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి.

* ప్రాక్టిస్‌ చేయడానికి ఉదయం 5 గంటల నుంచి 7.30 గంటలు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సమయాన్ని కేటాయించేలా ప్లాన్‌ చేసుకోవాలి. మధ్యాహ్న సమయంలో ప్రాక్టిస్‌ చేయకూడదు. ఆ సమయంలో రాత పరీక్షకు ప్రిపేర్‌ అవ్వాలి.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..