AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్మూ కాశ్మీర్ కు మళ్ళీ రాష్ట్ర ప్రతిపత్తి…? ఈ నెల 24 న ప్రధాని మోదీ ఆధ్వర్యాన ఆఖిల పక్ష సమావేశం…

జమ్మూ కాశ్మీర్ కి మళ్ళీ రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రధాని మోదీ ఈ నెల 24 న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ కి హాజరు కావాలని తనకు ఆహ్వానం అందిందని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ కు మళ్ళీ రాష్ట్ర ప్రతిపత్తి...? ఈ నెల 24 న ప్రధాని మోదీ ఆధ్వర్యాన ఆఖిల పక్ష సమావేశం...
Pm Narendra Modi
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Jun 19, 2021 | 4:07 PM

Share

జమ్మూ కాశ్మీర్ కి మళ్ళీ రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రధాని మోదీ ఈ నెల 24 న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ కి హాజరు కావాలని తనకు ఆహ్వానం అందిందని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తెలిపారు. ఆ సమావేశానికి హాజరయ్యే విషయమై రేపు తమ పార్టీ నేతలతో చర్చిస్తామని ఆమె చెప్పారు. జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేసి.. కాశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత అక్కడ ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి స్వస్తి చెప్పేందుకు కేంద్రం ఈ చర్య తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొనవచ్చు. కాశ్మీర్ కి రాష్ట్ర పునరుద్ధరించడంతో బాటు అక్కడ డీలిమిటేషన్ లేదా ఆయా నియోజకవర్గాల పునర్వర్గీకరణ వంటి అంశాలపై కూడా ఈ అత్యంత ప్రధానమైన సమావేశంలో చర్చించవచ్చునని తెలుస్తోంది. వచ్చే నవంబరులో గానీ లేక వచ్చే ఏడాది ఆరంభంలో గానీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

ఈ సమావేశానికి హాజరు కావాలని నిన్నటివరకు తొమ్మిది పార్టీలకు ఆహ్వానం అందిందని, అయితే మొత్తం 16 పార్టీలకు ఇన్విటేషన్ పంపుతారని సమాచారం. కాగా జమ్మూ కాశ్మీర్ లో రాజకీయ పక్రియ మొదలు పెట్టడానికి ఇంకా సమయం ఉందని పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజాద్ లోనే…అప్నీ పార్టీ నాయకుడు అల్తాఫ్ బుఖారీ వ్యాఖ్యానించారు. కానీ ముఖ్యమైన నేషనల్ కాన్ఫరెన్స్ దీనిపై ఇంకా తన స్పందనను తెలియజేయలేదు. ఫరూక్ అబ్దుల్లా వంటి వారు తమ అభిప్రాయాన్ని వెల్లడించాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి: ఎత్తిన కత్తి దించితే ఒట్టు.. అమేజింగ్ వీడియో వైరల్‌..!మహిళ అరుదైన ప్రతిభ :woman playing sword viral video.

Viral Video : పెళ్లి కూతురు డ్రెస్సు నుండి బయటకు వచ్చిన వ్యక్తి వైరల్ అవుతున్న వీడియో .

Viral Video : తెలివైన పనిమంతుడు…జోరువానలో గొడుగుపట్టుకుని హార్డ్ వర్క్ చేస్తున్న ఇంటిలిజెంట్ (వీడియో).

బ్లైండ్ స్కూల్ కి కోటి విరాళం ఇచ్చిన బాలీవుడ్ స్టార్..జవాన్లతో కలిసి వాలీబాల్ ఆడిన అక్షయ్ కుమార్.:Akshay Kumar video.

పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా