SBI Debit Card: ఎస్‌బీఐ డెబిట్ కార్డు పోయిందా? కొత్తది ఎలా పొందాలో తెలుసుకుందాం!
ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) డెబిట్ కార్డు పోయిందా? వెంటనే పోయిన కార్డును బ్లాక్ చేసి, కొత్త కార్డు కోసం అప్లై చేసుకోవాలి.
SBI Debit Card: మీరు మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) డెబిట్ కార్డును పోగొట్టుకున్నారా? అయితే బాధపడాల్సిన అవసరం లేదు. ఎంతో సులభంగా కొత్త కార్డును పొందవచ్చు. అలాగే పోయిన కార్డును ఎస్‌ఎంఎస్‌తో కానీ, రిజిస్టర్డ్ మొబైల్ నుంచి కానీ బ్లాక్ చేయాలి. మొదట కార్డు పోయిన తరువాత చేయాల్సి పని ఏంటంటే.. ఆ కార్డును బ్లాక్ చేయాలి. ఆ తరువాతే కొత్త కార్డు కోసం రిక్వెస్ట్ చేయాలి. ముందుగా డెబిట్ కం ఏటీఎం కార్డును బ్లాక్ చేయాలని భావిస్తే.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి BLOCK అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కార్డు చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేసి 567676కు ఎస్‌ఎంఎస్ పంపాలి. అనంతరం మీ కార్డును బ్లాక్ చేసినట్లుగా ఎస్‌బీఐ నుంచి ఓ మెసేజ్ వస్తుంది.
అలాగే ఫోన్ కాల్‌తో పోయిన కార్డును బ్లాక్ చేయాలంటే.. 18004253800, 1800112211 నంబర్లకు కాల్ చేయాలి. ఇవి టోల్ ఫ్రీ నంబర్స్. కాల్ చేసిన వెంటనే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) లో సూచించిన్లుగా చేసి, కార్డును బ్లాక్ చేయాలి. అనంతరం కొత్త కార్డు కోసం రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ లో లాగిన్ అవ్వాలి. ఇందులో రిక్వెస్ట్ ఆప్షన్‌లోకి వెళ్లి కొత్త కార్డు కోసం అప్లై చేసుకోవాలి. అయితే, కొత్త కార్డు పొందాలంటే మాత్రం రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మొబైల్ యాప్ తో కూడా కొత్త కార్డు కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. వీటితో పాటు sbicard.com/email కు ఈ మెయిల్ చేయడం ద్వారా.. లేదంటే 1800 425 3800 హెల్ప్‌లైన్ నెంబర్‌కు కాల్ చేసి కొత్త ఏటీఎం కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.
ఎస్‌బీఐ డెబిట్ కార్డును ఎలా బ్లాక్ చేయాలో చూద్దాం: 1800 112 211 డయల్ చేయండి. ఎస్‌బీఐ కార్డును బ్లాక్ చేసేందుకు కీప్యాడ్ లో నెంబర్ 2 నొక్కండి. అనంతరం పోయిన కార్డులోని చివరి 5 అంకెలను నమోదు చేయండి. ఆ తరువాత మీ కార్డ్ విజయవంతంగా బ్లాక్ చేసినట్లు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుంది.
Also Read:
PM Shram Yogi Mandana Yojana: ప్రతీ నెలా రూ. 55 జమ చేస్తే.. పెన్షన్ రూ. 3 వేలు పొందొచ్చు.! వివరాలివే