AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cibil Score: సిబిల్‌ స్కోర్ తక్కువున్నా బ్యాంక్ లోన్..! కానీ, కొన్ని కండీషన్స్… అవేంటో తెలుసా?

బ్యాంక్ లోన్ కావాలంటే కచ్చితంగా మన సిబిల్ స్కోర్ బాగుండాల్సిందే. ఈ స్కోర్ గ్రీన్ లో ఉంటేనే మనకు అవసరమైన లోన్ వస్తోంది. లేదంటే రిజక్ట్ అవుతుంది.

Cibil Score: సిబిల్‌ స్కోర్ తక్కువున్నా బ్యాంక్ లోన్..! కానీ, కొన్ని కండీషన్స్... అవేంటో తెలుసా?
Cibil Score
Venkata Chari
|

Updated on: Jun 19, 2021 | 7:21 PM

Share

Cibil Score: బ్యాంక్ లోన్ కావాలంటే కచ్చితంగా మన సిబిల్ స్కోర్ బాగుండాల్సిందే. ఈ స్కోర్ గ్రీన్ లో ఉంటేనే మనకు అవసరమైన లోన్ వస్తోంది. లేదంటే రిజక్ట్ అవుతుంది. క్రెడిట్ స్కోర్ బాగుంటే ఎలాగు లోన్ వస్తుంది. మరి సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ ఎలా పొందాలి? అయితే ఇది పూర్తిగా బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది. కొన్ని బ్యాంకులు క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయకుండా రిజక్ట్ చేస్తాయి. అయితే కొన్ని బ్యాంకులు మన అవసరాల మేరకు కొన్ని కండీషన్స్‌తో లోన్స్‌ను అందిస్తాయి. ఇలా అందించే లోన్స్‌లో వడ్డీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అదికూడా అన్ని కండీషన్లకు మనం ఒప్పుకుంటేనే లోన్‌ ను మంజూరు చేస్తాయి. సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉన్నప్పుడు మనం కోరిన మొత్తాన్ని కూడా బ్యాంకులు మంజూరు చేయవు. మనం కోరిన రుణంలో సగం లేదా అంతకంటే తక్కువగా లోన్‌ను అందిస్తాయి. కోరిన దానికంలే ఎక్కువ రుణం ఇచ్చేందుకు నిరాకరిస్తాయి. మరి ఇలా ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే బదులు.. సిబిల్‌ స్కోర్‌ ను గ్రీన్‌లో ఉంచుకోవాలి. స్కోర్ తగ్గకుండా చూసుకుని, సమయానికి బిల్స్, ఈఎంఐలు పే చేసుకోవాలి. ఇలా అయితే మన క్రెడిట్ స్కోర్ బాగుటుంది.

అసలు సిబిల్ స్కోర్‌ తగ్గడానికి కారణాలు చూద్దాం క్రెడిట్‌ కార్డ్‌ పేమెంట్స్ విషయంలో సమయానికి లోన్‌, ఈఎంఐ చెల్లించకపోవడం. ఒకేసారి నాలుగైదు ఈఎంఐలు కట్టడం. తరచుగా సిబిల్‌ స్కోర్‌ కోసం అప్లై చేయడం. చాలా తక్కువ టైంలో ఎక్కువ క్రెడిట్‌ కార్డులకు అప్లై చేయడం. క్రెడిట్‌ కార్డ్‌ ను లిమిట్‌గా వాడకపోవడం లాంటి కారణాలతో క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది.

అసలు క్రెడిట్ స్కోర్ ఎంతుండాలి? సాధారణంగా క్రెడిట్‌ కార్డ్‌ స్కోర్‌ మినిమం 700లు అంతకంటే ఎక్కువ ఉండేలా చూసువాలి. అప్పుడే క్రెడిట్ బార్ గ్రీన్‌లో ఉంటుంది. లేదంటే రెడ్‌లోకి మారుతుంది. ఈ సిబిల్ స్కోర్ క‌నిష్టంగా 300, గ‌రిష్ఠంగా 900 గా చూపిస్తుంది. ఈ స్కోర్ ఎంత ఎక్కువ‌గా ఉంటే అంత త్వరగా లోన్‌లు పొంద‌వ‌చ్చు. క్రెడిట్ స్కోర్ త‌క్కువ‌గా ఉంటే మీ లోన్ అప్లికేష‌న్ రద్దయ్యే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి నిర్ణీత గ‌డువులోగా క్రెడిట్ కార్డు బిల్లులు, ఈఎంఐ, లోన్లు చెల్లించ‌డం మంచిది.

Also Read:

SBI Debit Card: ఎస్‌బీఐ డెబిట్ కార్డు పోయిందా? కొత్తది ఎలా పొందాలో తెలుసుకుందాం!

Rythu Bandhu: రైతులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి రైతు బంధు డబ్బులు పోస్టాఫీసులో కూడా.. ఇలా చేస్తే క్షణాల్లో ..