Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PF ఖాతాదారులకు అలర్ట్.. కొత్త రూల్స్ తీసుకొచ్చిన ఈపీఎఫ్ఓ.. వీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే..

ప్రైవేట్.. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి పీఎఫ్ అకౌంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెలవారీ జీతం నుంచి కొంత

PF ఖాతాదారులకు అలర్ట్.. కొత్త రూల్స్ తీసుకొచ్చిన ఈపీఎఫ్ఓ.. వీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే..
Epfo
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 19, 2021 | 8:44 AM

ప్రైవేట్.. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి పీఎఫ్ అకౌంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెలవారీ జీతం నుంచి కొంత మొత్తంలో పీఎఫ్ అకౌంట్‏లో జమ అవుతుంది. అయితే ఈ కరోనా సంక్షోభంలో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈపీఎఫ్ విత్ డ్రాయెల్స్ నుంచి పీఎఫ్ బ్యాలెన్స్ వరకు పలు మార్పులు చేసింది.

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో పీఎఫ్ సబ్ స్క్రైబర్లు వారి ఈపీఎఫ్ ఖాతాల నుంచి సెకండ్ కోవిడ్ అడ్వాన్స్ తీసుకోవచ్చు. అంటే గతేడాది పీఎప్ డబ్బులు విత్ డ్రా చేసుకున్న వారు మళ్లీ ఈ సంవత్సరం డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే ఉద్యోగం కోల్పోయి నెల లేదా అంతకన్నా ఎక్కువ అయితే.. అప్పుడు పీఎఫ్ అకౌంట్ నుంచి 75 శాతం వరకు డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు. దీని కోసం పీఎఫ్ ఖాతా క్లోజ్ చేసుకోవాల్సిన పనిలేదు.

ఉద్యోగం కోల్పోయిన వారు కూడా వారి పీఎప్ ఖాతా నుంచి కోవిడ్ అడ్వాన్స్ కింద డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే కంపెనీ నుంచి పీఎఫ్ సెటిల్ మెంట్ కానీ వారికి ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఈపీఎఫ్‏వో ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఇన్సూరెన్స్ బెనిఫిట్ ను రూ.6 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు పెంచింది. సర్వీస్ లో ఉన్నప్పుడు ఈపీఎఫ్‏వో సబ్‏స్క్రైబర్ మరణిస్తే… నామినీకి ఈ డబ్బులు లభిస్తాయి. పీఎఫ్ అకౌంట్ ఉన్నవారు వారి ఆధార్ నెంబర్ ను కచ్చితంగా యూఏఎన్ తో లింక్ చేసుకోవాలి. లేదంటే కంపెనీ కంట్రిబ్యూషన్ డబ్బులు పీఎఫ్ అకౌంట్ లో జమ కావు. సెప్టెంబర్ 1లోపు ఆధార్, పీఎఫ్ అకౌంట్ లింక్ చేసుకోవాలి.

Also Read: Kadapa Crime News : కడప జిల్లాలో దారుణం.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది.. పారిపోతుండగా పట్టుకున్న గ్రామస్థులు

Daare Leda Song: సత్యదేవ్ ‘బ్లఫ్ మాస్టర్’ నుంచి దారే లేదా సాంగ్.. ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం అంటున్న నాని..

Dornakal: ఓ వైపు వర్షం.. మరోవైపు 4 గంటలుగా కరెంట్ కట్.. విద్యుత్ సిబ్బందికి చుక్కలు చూపించిన తొండ..