Dornakal: ఓ వైపు వర్షం.. మరోవైపు 4 గంటలుగా కరెంట్ కట్.. విద్యుత్ సిబ్బందికి చుక్కలు చూపించిన తొండ..

ఒక వైపు భారీ వర్షం.. మరోవైపు.. దోమల సమస్యల వీటన్నింటికి తోడు నాలుగు గంటలకు పైగా ఆ ప్రాంతంలో కరెంట్ లేకపోవడం..

Dornakal: ఓ వైపు వర్షం.. మరోవైపు 4 గంటలుగా కరెంట్ కట్.. విద్యుత్ సిబ్బందికి చుక్కలు చూపించిన తొండ..
Dornakal
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 19, 2021 | 7:35 AM

ఒక వైపు భారీ వర్షం.. మరోవైపు.. దోమల సమస్యల వీటన్నింటికి తోడు నాలుగు గంటలకు పైగా ఆ ప్రాంతంలో కరెంట్ లేకపోవడం.. వీటన్నింటితో కలిసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణలోని పలు ప్రాంతాల్లో రాత్రి 8.15 గంటల నుంచి 12.05 వరకు దాదాపు నాలుగు గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అర్దరాత్రి ఒక వైపు వర్షం కురుస్తుండడంతో.. కరెంట్ కట్ ఎందుకు జరిగిందనే విషయం తెలుసుకోవడానికి అక్కడి విద్యుత్ శాఖ సిబ్బంది ప్రయత్నాలు ప్రారంభించారు. విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అక్కడి ప్రాంతాల్లో ఉన్న ట్రాన్స్‏ఫార్మర్స్, స్తంభాలు అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి.. అసలు విషయం తెలుసుకుని తలపట్టుకున్నారు.

విద్యుత్ సిబ్బంది కలిసి అదే రాత్రి.. విద్యుత్ సరఫరా అంతరాయంకు గల కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. సబ్ స్టేషన్‏లో ఎలాంటి సమస్య లేకపోవడంతో.. ఏఈ, లైన్ ఇన్‏స్పెక్టర్, సబ్ ఇంజనీర్, ఇతర సిబ్బంది సబ్ స్టేషన్ నుంచి రైల్వే ట్రాక్ వరకు 11 కేవీ లైన్ కు సంబంధించి సుమారు 30 స్తంభాల పైకి ఎక్కి పరిశీలించారు. చివరకు రైల్వే ట్రాక్ సమీప స్తంభంపైన ఉన్న కండక్టర్ ఇన్సులేటర్ మీద తొండపడి చనిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినట్లుగా గుర్తించారు. ఇంకేముందు వెంటనే ఆ తొండను తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

Also Read: CBSE 10th Class result 2021: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు ఎప్పుడో తెలుసా..? మరింత క్లారిటీ ఇచ్చిన బోర్డు

PM Narendra Modi : మిల్కా సింగ్ మృతిపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. దేశం గొప్ప క్రీడాకారుడిని కోల్పోయిందని వ్యాఖ్య..

Horoscope Today: ఈ రాశులవారు ఆరోగ్యం.. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఈరోజు రాశిఫలాలు..

Healthy Snacks: సాయంత్రం స్నాక్స్‌లో మిర్చీలు, బ‌జ్జీలు తింటున్నారా? వీటిని ట్రై చేయండి.. ఆరోగ్యం సొంతం చేసుకోండి..