Horoscope Today: ఈ రాశులవారు ఆరోగ్యం.. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఈరోజు రాశిఫలాలు..

Horoscope Today 19th June 2021: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

Horoscope Today: ఈ రాశులవారు ఆరోగ్యం.. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఈరోజు రాశిఫలాలు..
Horoscope
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 19, 2021 | 7:15 AM

Horoscope Today 19th June 2021: ఈ ఆధునిక కాలంలోనూ.. చాలా మంది తమ భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందులో ఇప్పటికీ రాశిఫలాలను విశ్వసించేవారు ఎక్కువగానే ఉన్నారు. తమ రోజు ఎలా ఉండబోతుంది.. ఎలాంటి పనులు మొదలు పెట్టాలి.. అని తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇందులో భాగంగానే ఈరోజు (జూన్ 19న) శనివారం రాశిఫలాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి.. ఈరోజు వీరు తమకున్న సంపాదనను మరింత పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ సంపాదన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సంబంధమైన భావనలు ఏర్పడుతుంటాయి. ధన్వంతరి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

వృషభ రాశి.. ఈరోజు వీరు ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో అజాగ్రత్తగా వ్యవహరించకూడదు. నందీశ్వరుని దర్శనం మేలు చేస్తుంది.

మిథున రాశి.. ఈరోజు వీరు వ్యక్తిగత అవసరాల కోసం కొన్ని అప్పులు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇతరులకు ఇచ్చిన హామీలు ఒత్తిడికి గురిచేస్తుంటాయి. మహా మృత్యుంజయ స్తోత్రపారాయణం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి.. ఈరోజు వీరు ఉద్యోగాల విషయంలో క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ఉండాలి. అనుకోని సందర్భాలు.. అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. సంకటన గణపతి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది..

సింహరాశి.. ఈరోజు వీరు బంధువర్గం వారితో వ్యవహరించే సందర్భంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెరుగుతుంటాయి. లలితా అమ్మవారి సహస్ర నామా స్తోత్రపారాయణం మేలు చేస్తుంది.

కన్యరాశి.. ఈరోజు వీరు సామాజిక సేవ కార్యక్రమాల్లో పాల్గోంటుంటారు. ఉద్యోగాల విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. పేదవారికి అన్నదానం.. వస్త్రదానం చేసుకోవడం మంచిది.

తులరాశి.. ఈరోజు వీరికి ముఖ్యమైన వార్తలు అందుతుంటాయి. ప్రముఖులు మధ్య ఉన్న అభిప్రాయ బేధాలను తగ్గించుకోవడం మంచిది. శ్రీరామ రక్ష స్తో్త్ర పారాయణం మేలు చేస్తుంది.

వృశ్చిక రాశి.. ఈరోజు వీరు వేరు వేరు రూపాల్లో ఆహార విహారాదులలో జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోని ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు కూడా ఉంటాయి. మహాలక్ష్మి అర్చన మేలు చేస్తుంది. అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

ధనుస్సు రాశి.. ఈరోజు వీరు చేపట్టిన పనుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదు. ఖర్చులు పెరుగుతాయి. రామనామ స్మరణ మేలు చేస్తుంది.

మకర రాశి.. ఈరోజు వీరికి స్నేహితులు, బంధువుల నుంచి కొన్ని విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏమాత్రం తొందరపడకూడదు. అధైర్య పడనవసరం లేదు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శివాభిషేకం మేలు చేస్తుంది.

కుంభరాశి.. ఈరోజు వీరు స్నేహితులతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోంటుంటారు. సామాజిక సమస్యలు ఉంటాయి. అనారోగ్య సంబంధమైన భావనలు చోటు చేసుకుంటాయి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

మీనరాశి.. ఈరోజు వీరు తాము సంపాదించిన ధనం సంతృప్తికరంగా ఉంటుంది. స్నేహితుల సహకారాన్ని మేలు చేస్తుంది. శ్రీకృష్ణుడి నామ స్మరణ మేలు చేస్తుంది.

Also Read: Pen Studios: ఐదు భారీ ప్రాజెక్ట్‏లను ప్రకటించిన నిర్మాణ సంస్థ.. మొత్తం రూ.1500 కోట్లకు పైగే..

Vishal: డూప్ లేకుండానే యాక్షన్ సీన్ చేసిన హీరో.. తలకు తగిలిన సీసా.. విశాల్‏కు తృటిలో తప్పిన ప్రమాదం..