Pen Studios: ఐదు భారీ ప్రాజెక్ట్‏లను ప్రకటించిన నిర్మాణ సంస్థ.. మొత్తం రూ.1500 కోట్లకు పైగే..

సినీ పరిశ్రమలో సందడి ప్రారంభమైంది. అటూ బాలీవుడ్.. టాలీవుడ్ ‏లలో ఇప్పుడిప్పుడే సినిమాలు తిరిగి సెట్స్ పైకి వెళ్తున్నాయి.

Pen Studios: ఐదు భారీ ప్రాజెక్ట్‏లను ప్రకటించిన నిర్మాణ సంస్థ.. మొత్తం రూ.1500 కోట్లకు పైగే..
Pen Studios
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 19, 2021 | 6:50 AM

సినీ పరిశ్రమలో సందడి ప్రారంభమైంది. అటూ బాలీవుడ్.. టాలీవుడ్ ‏లలో ఇప్పుడిప్పుడే సినిమాలు తిరిగి సెట్స్ పైకి వెళ్తున్నాయి. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ మూవీస్ షూటింగ్స్ స్టార్ట్స్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత సంస్థ పెన్ స్టూడియోస్.. తమ నుంచి రాబోయే భారీ ప్రాజెక్టుల వివరాలను పంచుకుంది. ఇటీవల ఈ సంస్థ పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తుంది.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్.. అక్షయ్ కుమార్ బెల్ బాటమ్.. జాన్ అబ్రహం ఎటాక్ సినిమాలతోపాటు… అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన గంగూబాయి కతియావాడి.. అపరిచితుడు హిందీ రిమేక్ సినిమాలను ప్రకటించింది.

అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన బెల్ బాటమ్ మూవీ జూలై 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మిగిలిన చిత్రాల విడుదల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఆర్ఆర్ఆర్, గంగూబాయి కతియావాడి, ఎటాక్ సినిమాల హిందీ ప్రసార హక్కులను పెన్ స్టూడియో దక్కించుకున్న విషయం తెలిసిందే. రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో హిందీలో అపరిచితుడు మూవీ అన్నీయన్ పేరుతో రీమేక్ అవుతుంది. ఈ విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు (అన్నియన్) అప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. హిందీలోనూ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. అటు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా..డైరెక్టర్ వినాయక్ తెరకెక్కిస్తున్న ఛత్రపతి రీమేక్ ను కూడా పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో 3కోట్లతో భారీ సెట్ నిర్మించగా ఇటీవలి వర్షాలకు సెట్ డ్యామేజ్ అయినట్లుగా టాక్. రూ.500 కోట్లతో ఆర్ఆర్ఆర్ హక్కులను తీసుకుంది పెన్ స్టూడియోస్.. మొత్తంగా ఈ ఐదు భారీ ప్రాజెక్టులు అన్ని కలిపి దాదాపు రూ.1500 కోట్లు పైగా పెన్ మూవీస్ వెచ్చిస్తుంది.

Also Read: Vishal: డూప్ లేకుండానే యాక్షన్ సీన్ చేసిన హీరో.. తలకు తగిలిన సీసా.. విశాల్‏కు తృటిలో తప్పిన ప్రమాదం..

Sai Pallavi: గోరింటాకు పెట్టుకుని తెగ సిగ్గుపడుతున్న హైబ్రిడ్ పిల్ల.. సోషల్ మీడియాలో సాయి పల్లవి రచ్చ..

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ