Sai Pallavi: గోరింటాకు పెట్టుకుని తెగ సిగ్గుపడుతున్న హైబ్రిడ్ పిల్ల.. సోషల్ మీడియాలో సాయి పల్లవి రచ్చ..

సాయి పల్లవి.. తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాక్టింగ్‏తోపాటు టాలెంట్ ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు.

Sai Pallavi: గోరింటాకు పెట్టుకుని తెగ సిగ్గుపడుతున్న హైబ్రిడ్ పిల్ల.. సోషల్ మీడియాలో సాయి పల్లవి రచ్చ..
Sai Pallavi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 18, 2021 | 9:19 PM

సాయి పల్లవి.. తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాక్టింగ్‏తోపాటు టాలెంట్ ఉన్న హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. పెద్ద కళ్లు.. అందమైన నవ్వు.. జాలువారే కురులతో కుర్రకారును మాయ చేస్తున్న ఈ కేరళ బ్యూటీ.. మలయాళంలో వచ్చిన ప్రేమమ్ తో.. యూత్ క్రష్ గా మారింది. కొరియోగ్రాఫర్ గా కెరీర్ ను ఆరంభించినా.. మొదటిసారి ప్రేమమ్ సినిమాతో వెండితెరకు పరిచయమయిన ఈ అమ్మడు.. తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసింది. మొదటి సినిమాతోనే సాయి పల్లవికి ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. కేవలం సినిమాల్లోనే కాదు.. ఆమె నవ్వుకు.. ప్రవర్తనకు.. మాట తీరుకు ఎంతో మంది అభిమానులున్నారు.

అయితే సాయిపల్లవి.. కేవలం డబ్బుల కోసం మాత్రమే ప్రాజెక్టులను అంగీకరించదు. ముఖ్యంగా తన పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే ఒకే చెప్తుతుంది. అలాగే ఇప్పటికీ ఏలాంటి బ్యూటీ యాడ్స్ లోనూ సాయి పల్లవి నటించలేదు. రెండు కోట్ల ఆఫర్ వచ్చినా కూడా ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌కు సాయి పల్లవి నో చెప్పారు. అలా తన నిర్ణయాలతో సాయి పల్లవి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అటు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సాయిపల్లవి.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ తోపాటు.. ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సాయి పల్లవి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అందులో చేతికి.. కాళ్లకు గోరింటాకు డిజైన్స్ వేసుకున్నారు. సందర్బం ఏంటో చెప్పలేదు కానీ.. గోరింటాకును చూసి తెగ సిగ్గు పడిపోతున్నారు. సెల్ఫ్ లవ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ హైబ్రిడ్ పిల్ల.. ఇదిలా ఉంటే.. సాయి పల్లవి ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని సరసన శ్యామ్ సింగరాయ్ మూవీ.. అటు రానాతో విరాట పర్వం మూవీ చేస్తుంది.

ట్వీట్..

Also Read: Lokesh : లోకేష్ నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు తరిమికొడతారు.. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన మగాడు జగన్ : వైసీపీ నేతలు

Consumption of Milk: పాలు తాగితే మధుమేహం వస్తుందా? డయాబెటీస్ తో ఇబ్బంది పడేవారు పాలు తాగొచ్చా?