AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lokesh : లోకేష్ నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు తరిమికొడతారు.. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన మగాడు జగన్ : వైసీపీ నేతలు

తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్‌ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడని మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం మండిప‌డ్డారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే లోకేష్‌ను ప్రజలు తరిమికొడతారని ఆయన హెచ్చరించారు...

Lokesh : లోకేష్ నోరు అదుపులో పెట్టుకోకపోతే  ప్రజలు తరిమికొడతారు..  151 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన మగాడు జగన్ : వైసీపీ నేతలు
Gummanuru Jayaram And Tjr
Venkata Narayana
|

Updated on: Jun 18, 2021 | 9:06 PM

Share

Gummanuru Jayaram : తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్‌ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడని మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం మండిప‌డ్డారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే లోకేష్‌ను ప్రజలు తరిమికొడతారని ఆయన హెచ్చరించారు. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన మగాడు సీఎం వైయ‌స్ జగన్ అని చెప్పుకొచ్చిన గుమ్మనూరు.. ‘మీ నాన్న నిన్ను కూడా గెలిపించుకోలేకపోయాడు’ అంటూ ఎద్దేవా చేశారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ మీద లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. మంగళగిరిలో లోకేష్‌ను పిచ్చికుక్కను కొట్టినట్లు తరిమికొట్టారని జయరాం అన్నారు.

“టీడీపీ హయాంలో చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య జరిగింది.. టీడీపీ నేతలు మా నేతను హత్య చేశారు.. అప్పుడు లోకేష్ ఏమయ్యాడు” అంటూ మంత్రి ప్రశ్నించారు. చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు నారా లోకేష్ ఏం చేసినా కర్నూలులో టీడీపీకి భవిష్యత్‌ ఉండదని అన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు లేదని మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం అన్నారు .

వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు కూడా నారా లోకేష్ పై విమర్శలు గుప్పించారు. లోకేష్ నోటికి హ‌ద్దు అదుపు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గానికి వెళ్ళి నారా లోకేశ్‌ మాట్లాడిన భాషను రాష్ట్ర ప్రజలంతా చూశార‌ని చెప్పారు. ఇలాంటి కొడుకును కన్నందుకు నిజంగా చంద్రబాబు సిగ్గుపడాలన్నారు. విదేశాల్లోని యూనివర్శిటీల్లో చదవించి, ఇంత సంస్కార హీనుడిగా పెంచినందుకు చంద్రబాబు లెంపలు వేసుకుని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Read also : Nara Lokesh : కత్తితో బ్రతికేవాడు కత్తితోనే పోతాడాని మరోసారి గుర్తుచేస్తున్నా.. ! ఇదేనా మీ పారదర్శకత..? : లోకేష్