Nara Lokesh : కత్తితో బ్రతికేవాడు కత్తితోనే పోతాడాని మరోసారి గుర్తుచేస్తున్నా.. ! ఇదేనా మీ పారదర్శకత..? : లోకేష్

ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించారు.

Nara Lokesh : కత్తితో బ్రతికేవాడు కత్తితోనే పోతాడాని మరోసారి గుర్తుచేస్తున్నా.. ! ఇదేనా మీ పారదర్శకత..?   : లోకేష్
Nara Lokesh
Follow us

|

Updated on: Jun 18, 2021 | 8:09 PM

Nara Lokesh Hot comments on YS Jagan : ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో కామెంట్లు చేశారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధించారు. ” కత్తితో బ్రతికేవాడు కత్తితోనే పోతాడాని వైయస్ జగన్ కి మరోసారి గుర్తుచేస్తున్నా.. హత్యలకు పాల్పడుతున్న ఎవ్వరినీ వదిలిపెట్టం. చేస్తున్న ప్రతి తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు.” అంటూ లోకేష్ హెచ్చరించారు.

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం పెసరవాయిలో హత్యకు గురైన టిడిపి నాయకులు వడ్డు నాగేశ్వర రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిల‌ పార్థివదేహాలకు నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. వడ్డు ఫ్యామిలీకి పార్టీ అన్నీ విధాలా అండగా ఉంటుందని చెప్పారు.

“డూబు రెడ్డి ఉత్తుత్తి ఉద్యోగాల డాబు కాలెండ‌ర్ విడుదల చేసారు. 2 ల‌క్ష‌ల 30 వేల‌కు పైగా ప్ర‌భుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని జగన్ హామీ ఇచ్చి అధికారంలోకొచ్చాకా నిరుద్యోగ యువతని మోసం చేసారు. ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేసుకుని.. 54వేలు ఉద్యోగాలు కొత్త‌గా ఇచ్చిన‌ట్టు మోస‌పు ప్ర‌క‌ట‌న‌ ఇచ్చారు. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు వాలంటీర్లు,వార్డు / గ్రామ‌స‌చివాల‌యల్లో పోస్టులు వేసుకుని జాబులిచ్చిన‌ట్టు హడావిడి చేస్తున్నారు.

..వైసీపీకి దొంగ ఓట్లేయించే వైసీపీ కార్య‌క‌ర్త‌ల్ని వ‌లంటీర్లుగా వేసుకోవ‌డం వివ‌క్ష లేక‌పోవ‌డ‌మా..? వార్డు, గ్రామ‌స‌చివాల‌య ఉద్యోగ భ‌ర్తీ ప‌రీక్ష పేప‌రు అమ్మేయ‌డం అవినీతికి తావులేకుండా భ‌ర్తీ చేసిన‌ట్టా? ఉద్యోగాలు అమ్ముకోవ‌డం మీ భాష‌లో అత్యంత పార‌ద‌ర్శ‌క‌తా? జే గ్యాంగ్ ప్రాణాంత‌క మ‌ద్యం బ్రాండ్లు ప్రెసిడెంట్ మెడ‌ల్ అమ్మే ఉద్యోగాలూ గౌర‌వ‌నీయ‌మైన ప్ర‌భుత్వ ఉద్యోగాలా?” అంటూ లోకేష్ తీవ్ర జగన్ సర్కారుపై స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

Read also : Job calendar : లంచాలకు, పైరవీలకు తావులేకుండా ఈ ఏడాది 10,143 ఉద్యోగాల భర్తీ..! జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన సీఎం