Vishal: డూప్ లేకుండానే యాక్షన్ సీన్ చేసిన హీరో.. తలకు తగిలిన సీసా.. విశాల్‏కు తృటిలో తప్పిన ప్రమాదం..

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలో కూడా షూటింగ్స్ తిరిగి ప్రారంభమయ్యాయి.

Vishal: డూప్ లేకుండానే యాక్షన్ సీన్ చేసిన హీరో.. తలకు తగిలిన సీసా.. విశాల్‏కు తృటిలో తప్పిన ప్రమాదం..
Vishal
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 19, 2021 | 6:29 AM

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో సినీ పరిశ్రమలో కూడా షూటింగ్స్ తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే కరోనా నిబంధనలు పాటిస్తూ.. చిత్రీకరణ జరపడానికి హీరోలతోపాటు.. దర్శక నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్ హీరో విశాల్ తన తదుపరి సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ఈ హీరో యాక్షన్ సీన్ లో కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. డూప్ లేకుండానే ఫైటింగ్ సీన్ చేస్తున్న విశాల్ తల వెనుక భాగంలో ఓ సీన తగిలింది. అయితే ఆయనకు పెద్దగా గాయలేమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఆ ఫైట్ స్వీకెన్స్ ను బ్రేక్ తీసుకోకుండా చేస్తున్నారు విశాల్.

ఈ విషయంపై హీరో విశాల్ స్పందిస్తూ.. కొద్దిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానని వెల్లడించారు. ఆ పైటర్ తప్పేమిలేదని.. కాకపోతే.. కొంచెం టైమింగ్ తప్పిందని.. ఫైట్ సీన్స్ చిత్రీకరణలో ఇలాంటివి సాధారణమేనని తెలిపారు. భగవంతుడి నిర్ణయం.. అందరి ఆశీస్సులతో మళ్లీ షూటింగ్ లో పాల్గొంటున్నానని విశాల్ చెప్పారు. ఈ చిత్రానికి పి. శరవణన్ దర్శకత్వం వహిస్తుండగా.. పైట్ మాస్టర్ రవివర్మ ఆధ్వర్యంలో యాక్షన్ సీన్స్ తెరకెక్కి్స్తున్నారు.

ట్వీట్..

Also Read: Actress Revathi Sampath: దర్శకనిర్మాతలపై నటి రేవతి షాకింగ్ కామెంట్స్.. మొత్తం 14 మంది పేర్లను బయటపెట్టిన నటి..

Nithiin: మరో ప్రాజెక్ట్‏కు నితిన్ గ్రీన్ సిగ్నల్.. ఆ డైరెక్టర్ సినిమాలో మరోసారి ‘భీష్మ’ జోడి ?

Sai Pallavi: గోరింటాకు పెట్టుకుని తెగ సిగ్గుపడుతున్న హైబ్రిడ్ పిల్ల.. సోషల్ మీడియాలో సాయి పల్లవి రచ్చ..