Nithiin: మరో ప్రాజెక్ట్‏కు నితిన్ గ్రీన్ సిగ్నల్.. ఆ డైరెక్టర్ సినిమాలో మరోసారి ‘భీష్మ’ జోడి ?

Nithiin: నితిన్.. హిట్టు.. ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తున్నాడు. ఇటీవల చెక్, రంగ్ దే మూవీలతో ప్రేక్షకుల ముందుకు

Nithiin: మరో ప్రాజెక్ట్‏కు నితిన్ గ్రీన్ సిగ్నల్.. ఆ డైరెక్టర్ సినిమాలో మరోసారి 'భీష్మ' జోడి ?
Rashmika
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 18, 2021 | 8:48 PM

Nithiin: నితిన్.. హిట్టు.. ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తున్నాడు. ఇటీవల చెక్, రంగ్ దే మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆశించినంత హిట్ అందుకోలేకపోయాడు. ఈ సినిమాల వెంటనే మాస్ట్రో సినిమాను సెట్స్ పైకి తీసుకోచ్చాడు ఈ టాలెంటెడ్ హీరో. ఈ ఏడాది  రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన నితిన్.. మాస్ట్రో సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేశ్ హీరోయిన్ గా నటిస్తోంది.  ఇక త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. Rashmika Mandanna

అయితే ఈ సినిమా ద్వారా నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయని టాక్ నడుస్తోంది. ఇందులో నితిన్ కు జోడిగా రష్మిక నటించనున్నట్లాగా టాక్. అయితే ఇప్పటికే వీరిద్దరు కలిసి భీష్మ సినిమాలో నటించారు. ఆ మూవీ అంతగా హిట్ కాకపోయిన… వీరిద్దరి జోడి మాత్రం సూపర్ హిట్ అని టాక్ వచ్చింది. అందుకే నితిన్.. వక్కంతం వంశీ కాంబోలో రాబోయే సినిమాలో రష్మికను తీసుకోవాలని భావిస్తున్నారట మేకర్స్.

ప్రస్తుతం రష్మిక.. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తోంది. అలాగే అటు బాలీవుడ్ లోనూ రెండు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

Also Read: SHE Teams : రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోకిరీ పనులు చేస్తోన్న 53 మందిని అదుపులోకి తీసుకున్న షీటీమ్స్

Telangana Corona: తెలంగాణలో క్రమంగా తగ్గుతున్న కరోనా ఉధృతి.. జీహెచ్ఎంసీలోనే అత్యధిక కేసులు

COVID Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే పురుషులలో పునరుత్పత్తి సామర్ధ్యం తగ్గుతుందనేది అపోహ.. తేల్చిచెప్పిన అధ్యయనాలు!

TTD Chairman YV Subba Reddy: ఈనెల 21తో ముగియనున్న టీటీడీ ఛైర్మన్ పదవీకాలం.. మరోసారి వైవీ సుబ్బారెడ్డికే ఛాన్స్?