AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SHE Teams : రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోకిరీ పనులు చేస్తోన్న 53 మందిని అదుపులోకి తీసుకున్న షీటీమ్స్

మేడిపల్లిలో మహిళ ప్రభుత్వ ఉద్యోగిని బాత్ రమ్ లో తొంగి చూసిన శ్రవణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అటు, వనస్థలిపురంలో మనమరాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్న 65 వృద్ధుడిపై..

SHE Teams : రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోకిరీ పనులు చేస్తోన్న 53 మందిని అదుపులోకి  తీసుకున్న షీటీమ్స్
Eve Teasers
Venkata Narayana
|

Updated on: Jun 18, 2021 | 7:04 PM

Share

Rachakonda Police Commissionerate : హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో 53 మంది పోకిరీలను ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో అమ్మయులను వేధిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. మేడిపల్లిలో మహిళ ప్రభుత్వ ఉద్యోగిని బాత్ రమ్ లో తొంగి చూసిన శ్రవణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అటు, వనస్థలిపురంలో మనమరాళ్లతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్న 65 వృద్ధుడిపై పోలీసులు పెటీ కేసు కేసు నమోదు చేశారు.

ఇక, కుషాయిగూడ, చౌటుప్పల్, మల్కాజిగిరి ప్రాంతంలో రోడ్ల పై ఈవ్ టీజింగ్ చేస్తూ కొందరు యువకులు షీ టీమ్స్ కు దొరికిపోయారు. మెట్రో ట్రైన్ లో లేడీస్ కంపార్ట్మెంట్ లో నిలబడ్డ 10 మందికి షీ టీమ్స్ ఫైన్ విధించాయి. ఇలా మొత్తంగా రాచకొండ పరిధిలో ఇవాళ 31 FIRలు నమోదు చేశారు.

39 మందిపై పెటీ కేసులు కేసులు, ఒక కౌన్సెలింగ్ కేసు, ఇలా పోకిరీ చేష్టలకు దిగిన వారిపై మొత్తంగా 71 కేసులు నమోదు చేసినట్టు షీ టీమ్స్ వెల్లడించాయి. అరెస్ట్ అయిన వారిలో ఒక్కరు మైనర్ కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

She Teams

She Teams

Read also : Job calendar : లంచాలకు, పైరవీలకు తావులేకుండా ఈ ఏడాది 10,143 ఉద్యోగాల భర్తీ..! జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన సీఎం