Actress Revathi Sampath: దర్శకనిర్మాతలపై నటి రేవతి షాకింగ్ కామెంట్స్.. మొత్తం 14 మంది పేర్లను బయటపెట్టిన నటి..

సినీ పరిశ్రమలో మహిళలను కొందరు దర్శకనిర్మాతలు.. వేధించేవారని గతంలో పలువురు తారలు బయటపెట్టిన సంగతి తెలిసిందే.

Actress Revathi Sampath: దర్శకనిర్మాతలపై నటి రేవతి షాకింగ్ కామెంట్స్.. మొత్తం 14 మంది పేర్లను బయటపెట్టిన నటి..
Revathi
Follow us

|

Updated on: Jun 18, 2021 | 6:08 PM

సినీ పరిశ్రమలో మహిళలను కొందరు దర్శకనిర్మాతలు.. వేధించేవారని గతంలో పలువురు తారలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా.. నార్త్, సౌత్ సినీ పరిశ్రమలోని కొందరు తారలు “మీటూ ” ఉద్యమంతో బయటికొచ్చి తమకు ఎదురైన చెదు అనుభవాలను బయటపెట్టారు. ఇప్పటికీ పలువురు నటీమణులు.. మీటూ ఉద్యమంతో పోరాటడం చేస్తూన్నారు. తాజాగా మలయాళ నటి రేవతి.. దక్షిణాది సినీ ప్రముఖులపై షాకింగ్ కామెంట్స్ చేసింది. తనను శారీరకంగా.. మానసికంగా వేధించారంటూ ఆరోపిస్తూ మొత్తం 14 మంది పేర్లను ఫోటోలతో సహా ఫేస్ బుక్ వేదికగా బయటపెట్టారు. దీంతో ఇప్పుడు సినీ వర్గాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

రేవతి విడుదల చేసిన పేర్లలో పాపులర్ నటుడు సిద్ధిక్, దర్శకుడు రాజేష్ టచ్ రివర్, పోలీస్ ఇన్స్పెక్టర్, డాక్టర్ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఈ లైంగిక నేరస్తుల జాబితాలో నందూ అశోకన్ అనే డివైఎఫ్ఐ నాయకుడని రేవతి పేర్కొంది. ” ఈ జాబితాలో నన్ను లైంగికంగా, మానసికంగా.. మాటలతో వేధించిన వ్యక్తులు ఉన్నారు. ఈ మోసగాళ్ల గురించి ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. సినిమాల్లో పనిచేసే మహిళలకు ఈ కష్టాలు తప్పవు. అలాగని ఈ పోరాటంలో నేను ఒక్క అడుగు కూడా వెనక్కి వేయను ” అని తెలిపారు. రేవతి షేర్ చేసిన ఈ జాబితాతో ఒక్కసారిగా మలయాళ ఇండస్ట్రీ షాక్ కు గురయ్యాంది.

Actress Revathi Sampath

Actress Revathi Sampath

రేవతి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పేర్లు.. 1) రాజేష్ టచ్‌రైవర్ (డైరెక్టర్) 2) సిద్దిక్ (నటుడు) 3) ఆశిక్ మాహి (ఫోటోగ్రాఫర్) 4) షిజు (నటుడు) 5) అభిల్ దేవ్ (కేరళ ఫ్యాషన్ లీగ్ వ్యవస్థాపకుడు) 6) అజయ్ ప్రభాకర్ (డాక్టర్) 7) ఎంఎస్ పధుష్ (దుర్వినియోగదారుడు) 8) సౌరభ్ కృష్ణన్ (సైబర్ బల్లీ) 9) నందు అశోకన్ (డివైఎఫ్ఐ యూనిట్ కమిటీ సభ్యుడు, నేదుంకర్) 10) మాక్స్వెల్ జోస్ (షార్ట్‌ ఫిల్మ్‌ దర్శకుడు) 11) షానూబ్ కరవత్ (యాడ్ డైరెక్టర్) 12) రాగేంద్ పై (కాస్ట్ మి పర్ఫెక్ట్, క్యాస్టింగ్ డైరెక్టర్) 13) సారున్ లియో (ఈఎస్ఎఎఫ్ బ్యాంక్ ఏజెంట్, వాలియతురా) 14) బిను (సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పూంతురా పోలీస్ స్టేషన్, తిరువనంతపురం)

ఇదిలా ఉంటే.. రేవతి చేసిన ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలను అని డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్ అన్నారు.  పరువు నష్టం కలిగించేలా.. తన పేరును.. ఫోటోను ప్రచురించకూడదంటూ విలేకరులను కోరారు.. నా మీద మీడియాలో వస్తున్న కథనాలను చూసి ఆశ్చర్యపోయాను. ఈ ఆరోపణలకు స్పందించాల్సిన బాధ్యత నాపై వుంది కాబట్టి స్పందిస్తున్నాను. నాపై ఆ యువతి నిరాధారమైన ఆరోపణలను చేస్తూ, ఏ చట్టపరమైన వేదికను ఆశ్రయించకుండా సులభంగా సోషల్ మీడియాను ఎంచుకుంది. సోషల్ మీడియా ద్వారా ఎవరినైనా అపఖ్యాతి పాలు చేయడం సులభం. దానికి ఏలాంటి ఆధారాలు నిరూపించాల్సిన అవసరం లేదు. అందుకే దాన్ని వేదికగా తీసుకుంది. నేను ప్రతి పాత్రికేయుడికి గౌరవం ఇస్తాను. పాత్రికేయ విలువలను గౌరవిస్తాను. అయినప్పటికీ పరువు నష్టం కలిగించే ఆధారాలు లేని ఒక ఫేస్ బుక్ పోస్ట్ ను ఆధారంగా తీసుకొని మీరు నా ఫోటోను ప్రచురిస్తూ, పరువు నష్టం కలిగించేలా వార్తలలో నా పేరు ను తీసివేయాలని.. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి నిరాధారమైన వార్తల్లో కూడా నా పేరు ఊపయోగించకుండా ఉండాలని మీడియాను కోరుకుంటున్నాను అని డైరెక్టర్ రాజేష్ అన్నారు.

Also Read: Viral Video: సింహం, మొసలి మధ్య భీకర పోరు.. చివరికి ఆ ఎర దక్కింది ఎవరికంటే.! షాకింగ్ వీడియో