AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

In The Name Of God: ఆహా వేదికగా ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’.. రివ్యూ..

In The Name Of God Review:  కరోనా సంక్షోభంతో థియేటర్లు మూతపడడంతో ఓటీటీ వేదికలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నాయి.

In The Name Of God: ఆహా వేదికగా 'ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్'.. రివ్యూ..
In The Name Of God
Rajitha Chanti
|

Updated on: Jun 18, 2021 | 7:44 PM

Share

In The Name Of God Review:  కరోనా సంక్షోభంతో థియేటర్లు మూతపడడంతో ఓటీటీ వేదికలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నాయి. విభిన్న కథాంశంతో తెరకెక్కిన వెబ్ సిరీస్‏లను తెలుగు ప్రేక్షకులను పరిచయం చేస్తున్న తొలి తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా తాజాగా మరో విభిన్న ప్రేక్షకులను పరిచయం పరిచయం చేసింది. కమెడియన్ ప్రియదర్శి, బిగ్ బాస్ ఫేమ్ నందిని రాయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఇన్‌ ది నేమ్‌ ఆఫ్‌ గాడ్‌’ ఈరోజు (జూన్ 18) నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ విషయానికి వస్తే.. ఆది (ప్రియదర్శి), అతని తండ్రి చిన్నప్పుడే భార్యబిడ్డలను వదిలేసి వెళ్లిపోతాడు.. తల్లి మరణించాక వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులతో గోదావరి తీరంలో రిసార్ట్ పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు ఆది. అదే ఊరిలో ఉండే అయ్యప్ప (పోసాని).. మీనా (నందినీ రాయ్) భార్యభర్తలు. అయితే అయ్యప్ప భార్య అదే ఊరిలో ఉండే థామస్ (వికాస్ ) ను ప్రేమిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న అయ్యప్ప భార్యతో వాదనకు దిగుతాడు. వీరిద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో అయ్యప్ప .. తన భార్య చేతిలోనే హత్యకు గురవుతాడు. అక్కడి నుంచి ఈ వెబ్ సిరీస్ ఊహించని మలుపులు తిరుగుతుంది. అయ్యప్పను హత్య చేసింది ఎవరో తెలుసుకోవాలని కొందరు, హవాలా సొమ్ము ఐదు కోట్లు ఎక్కడికి పోయాయో తెలియక మరికొందరు ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు. మొత్తం మీద ప్రేక్షకులకు ప్రతి క్షణం.. ఉత్కంఠభరింతగా.. ఆసక్తికరంగా ఈ వెబ్ సిరీస్ చిత్రీకరించారు.

ప్రియదర్శి.. పోసాని.. నందినీరాయ్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టున్నారనే చెప్పుకోవాలి. అలాగే.. దర్శకత్వం.. సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం బాగున్నాయి.

ట్రైలర్..

Also Read: SHE Teams : రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోకిరీ పనులు చేస్తోన్న 53 మందిని అదుపులోకి తీసుకున్న షీటీమ్స్

Woman Given Both Vaccines: టీకా కోసం వచ్చిన మహిళకు ఒకేసారి రెండు వ్యాక్సిన్లు.. ఐదు నిమిషాల వ్యవధిలో కోవిషీల్డ్, కోవాగ్జిన్.. ఇప్పుడెలా ఉందంటే?

Heartwarming Video: ఈ కుక్క నిజంగా సూపర్ హీరోనే.. ఈ వీడియో చూస్తూ మీరూ అదే మాట అంటారు.. ఎందుకంటే..

కాసేపట్లో పెళ్లి.. పోలీసుల రాకతో సీన్ రివర్స్.. చివరకు వరుడి తమ్ముడినే పెళ్లాడిన వధువు.. ఎక్కడంటే..