కాసేపట్లో పెళ్లి.. పోలీసుల రాకతో సీన్ రివర్స్.. చివరకు వరుడి తమ్ముడినే పెళ్లాడిన వధువు.. ఎక్కడంటే..
మన భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక పెళ్లంటే అటు అమ్మాయి తరపువాళ్లు.. ఇటు అబ్బాయి తరపువాళ్లు ఎంతో సంబంరంగా నిర్వహించే వేడుక..
మన భారతీయ సంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక పెళ్లంటే అటు అమ్మాయి తరపువాళ్లు.. ఇటు అబ్బాయి తరపువాళ్లు ఎంతో సంబంరంగా నిర్వహించే వేడుక.. రెండు కుటుంబాల కలయిక. మ ఇంటి ఆడబిడ్డను అత్తారింటికి పంపే వేడుకను తమకు తోచినంతలో ఘనంగా జరిపించాలని ఆరాటపడతారు ప్రతీ తల్లిదండ్రులు. వివాహం జరుగుతున్న ప్రదేశంలో అంత సంతోషంగా.. భావోద్వేగాలతో కలిసిన వాతావరణం కనిపిస్తుంటుంది. అలాంటి పెళ్లిలో వధువుతోపాటు ఆమె కుటుంబసభ్యులకు.. అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఇంకాసేపట్లో వధువు మెడలో వరుడు తాళి కడతాడనగా.. ఓ యువతి కళ్యాణ మండపంలోకి ప్రవేశించింది. వరుడికి ఇదివరకే రహస్యంగ పెళ్లైందని తెలిసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో ఆ వధువు ఆ వరుడి తమ్ముడినే పెళ్లి చేసుకుని అదే ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది.
వివరాల్ళోకెళితే.. పాట్లాలోని పాలీగంజ్ ప్రాంతంలోని అనిల్ కుమార్, పింకీ కుమారికి ఈనెల 15న పెద్దలు వివాహం చేయాలనుకున్నారు. అయితే అనిల్ అప్పటికే వేరే యువతిని ప్రేమించి రహస్యంగా వివాహం చేసుకున్నాడు. అయితే ఇంట్లో పెద్దలను ఎదురించలేక మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. మరి కొద్దిసేపట్లో తాళి కడతాడనగా.. అనిల్ భార్య పోలీసులతో ఎంట్రీ ఇచ్చింది. ఇంకేముంది.. అక్కడివారందరి ముందు అనిల్ నిజాన్ని ఒప్పుకున్నాడు. దీంతో ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసిన పెద్దలు ఆ తర్వాత రోజే వరుడి తమ్ముడితో వధువుకు తాళి కట్టించారు.