KTR : గృహ ప్రవేశాల ముహూర్తాలు ఖరారు : ఇక గ్రేటర్ హైదరాబాద్ లో అంబరాన్నంటనున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవ సంబరాలు
కేసీఆర్ సర్కారు రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల గృహ ప్రవేశాలకు ముహూర్తం దగ్గర పడింది. ఇప్పటికే లాంఛనంగా పలు చోట్ల ప్రారంభోత్సవాలు జరిగినా ఈ నెలాఖరు నుంచి..
Double Bedroom Houses : కేసీఆర్ సర్కారు రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల గృహ ప్రవేశాలకు ముహూర్తం దగ్గర పడింది. ఇప్పటికే లాంఛనంగా పలు చోట్ల ప్రారంభోత్సవాలు జరిగినా ఈ నెలాఖరు నుంచి భారీ స్థాయిలో ఇళ్ల ప్రారంభోత్సవాలకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఈనెల 26, 28 , జూలై 1, 4 వ తేదీలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ భారీ ఎత్తున ప్రారంభిస్తారు. గ్రేటర్ లోని అంబేద్కర్ నగర్ పీవీ మార్గ్ లో 330, జీవైఆర్ కంపౌండ్ లో 180, పొట్టి శ్రీరాములు నగర్ లో 162, గొల్ల కుర్మయ్య కాలనీలో 10 డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవాల్లో కేటీఆర్ పాల్గొంటారు.
ఇందులో భాగంగా, నిర్మాణం పూర్తయిన మరికొన్ని ప్రాంతాల్లోని ఇళ్లను జీహెచ్ఎంసీ దశలవారిగా లబ్దిదారుకు అందించనుంది. ఇప్పటి వరకు గ్రేటర్లో 5 వేల ఇళ్ల వరకు లబ్ధిదారులకు అందించిన జీహెచ్ఎంసీ.. ఇళ్ల నిర్మాణం చివరి దశలో ఉన్న 70 వేలకు పైగా ఇళ్లను ఈ నెలాఖరు నాటికి లబ్ది దారులకు అందించేందుకు కృషి చేస్తోంది.
ఇందులో కొల్లురు 15, 660, అహ్మద్ గూడ 4,428 ఇళ్లు ఉన్నాయి. మొత్తంగా గ్రేటర్లో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు అందించాలని కేసీఆర్ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే.
Read also : Vijayasai reddy vs Ashok Gajapathi raju : ‘ఈ 40 ఏళ్లలో మీ హిందూత్వ ఎటు పోయింది అశోక్?’ : విజయసాయిరెడ్డి