Corona: కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో సందడి చేయనున్న తొలి సినిమా అదేనా.? ఆగస్టులో రానున్న..
Corona Second Wave: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎలా అతాలకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటికి కనిపించని ఓ వైరస్ మానవజాతిని కకావికలం చేసింది. కరోనా కారణంగా ప్రభావితం కానీ రంగమంటూ ఏది లేదని...
Corona Second Wave: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎలా అతాలకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటికి కనిపించని ఓ వైరస్ మానవజాతిని కకావికలం చేసింది. కరోనా కారణంగా ప్రభావితం కానీ రంగమంటూ ఏది లేదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన రంగాల్లో సినిమా రంగం ఒకటి. కరోనా తొలి వేవ్ సమయంలో థియేటర్లు చాలా రోజులు మూతపడ్డ విషయం తెలిసిందే. ఇక కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయన్న సమయంలో మళ్లీ థియేటర్లు తిరిగి ఓపెన్ అయ్యాయి.
అయితే మరో ఉపద్రవంలా వచ్చిన కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ థియేటర్లు మూతపడ్డాయి. ఇక తాజాగా మళ్లీ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో తిరిగి థియేటర్లు త్వరలోనే తిరిగి ప్రారంభంకానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే థియేటర్లు మళ్లీ ఓపెన్ అయితే విడుదలయ్యే తొలి సినిమా ఏంటన్నదానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు సెకండ్ తర్వాత థియేటర్లలోకి రానున్న మొదటి చిత్రం విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప అని తెలుస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కొద్ది పాటి వర్క్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో మేకర్స్ ఈ సినిమాను త్వరగతిన పూర్తి చేసిన థియేటర్లు ప్రారంభసమయానికి సిద్ధం చేయాలనే ఆలోచనలో ఉన్నారని టాక్. ఈ సినిమాను ఆగస్టు రెండో వారంలో విడుదల చేయడానికి మేకర్స్ సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇక నారప్ప సినిమాను.. తమిళంలో విజయవంతమైన అసురన్‌కి రీమక్‌గా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వెంకీ సరసన ప్రియమణి నటిస్తోంది.
Also Read: Ajith: ఇద్దరు దర్శకులతో హ్యాట్రిక్ సినిమాలు.. నయా రికార్డ్ సెట్ చేస్తున్న అజిత్
RadheShyam Movie Video: ‘రాధేశ్యామ్’ మూవీతో ప్రభాస్ మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడా ?