Keerthy Suresh: పర్‌ఫెక్ట్ పాట్నర్‌తో పిక్‌నిక్ ఎంజాయ్ చేస్తోన్న కీర్తి.. ఇంతకా పాట్నర్ ఎవరనేగా..?
Keerthy Suresh: బాల నటిగా నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు నటి కీర్తి సురేశ్. నేను శైలజ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది టాలీవుడ్‌లోనూ మంచి నటిగా గుర్తింపు...
Keerthy Suresh: బాల నటిగా నటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు నటి కీర్తి సురేశ్. నేను శైలజ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది టాలీవుడ్‌లోనూ మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఇక మహా నటి చిత్రంతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించిందీ చిన్నది. జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకుని తన నటనలోని స్టామినా ఏంటో సాటి చెప్పింది. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది కీర్తి సురేశ్. తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే కీర్తి సురేశ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికర ఫొటోను పోస్ట్ చేసింది. జూన్ 18న ఇంటర్నేషనల్ పిక్‌నిక్ డేను పురస్కరించుకొని సరాదగా గడిపిన ఓ ఫొటోను షేర్ చేసిందీ బ్యూటీ. ఇందులో తన పెంపుడు శునకంతో ఏదో బీచ్ ఒడ్డున దిగిన ఫొటోను షేర్ చేసిన కీర్తి.. పర్‌ఫెక్ట్ వాతావరణంలో, పర్‌ఫెక్ట్ పాట్నర్‌తో ఉన్నాను. ఇంతకంటే నాకు ఏం కావాలి అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ను రాసుకొచ్చింది. ఇక కీర్తి కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం గుడ్ లక్ అనే సినిమాలో నటిస్తోంది.
కీర్తి సురేశ్ పోస్ట్ చేసిన పోస్ట్..
View this post on Instagram
Also Read: Salman Khan’s Radhe: సల్మాన్ దెబ్బకి హైబ్రీడ్ రిలీజ్ అన్న కాన్సెప్ట్‌నే పక్కన పెడుతున్న బాలీవుడ్
Aditi Rao Hydari : ఆ సినిమా ఓకే చేయడం నా కెరీర్‌లోనే డేరింగ్ డెసిషన్ అంటున్న అదితి..
Salman Khan’s Radhe: సల్మాన్ దెబ్బకి హైబ్రీడ్ రిలీజ్ అన్న కాన్సెప్ట్‌నే పక్కన పెడుతున్న బాలీవుడ్