AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan’s Radhe: సల్మాన్ దెబ్బకి హైబ్రీడ్ రిలీజ్ అన్న కాన్సెప్ట్‌నే పక్కన పెడుతున్న బాలీవుడ్

ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజ్ అయిన బిగ్ బడ్జెట్ మూవీ రాధే. సల్మాన్‌ ఖాన్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమా కావటంతో ఓటీటీ రిలీజ్‌లోనూ భారీ హైప్‌ క్రియేట్ చేసింది ఈ సినిమా.

Salman Khan's Radhe: సల్మాన్ దెబ్బకి హైబ్రీడ్ రిలీజ్ అన్న కాన్సెప్ట్‌నే పక్కన పెడుతున్న బాలీవుడ్
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2021 | 10:43 AM

Share

Radhe : ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజ్ అయిన బిగ్ బడ్జెట్ మూవీ రాధే. సల్మాన్‌ ఖాన్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమా కావటంతో ఓటీటీ రిలీజ్‌లోనూ భారీ హైప్‌ క్రియేట్ చేసింది ఈ సినిమా. ఫస్ట్ టైమ్ హైబ్రీడ్ రిలీజ్ అన్న కాన్సెప్ట్‌ను తెరమీదకు తీసుకువచ్చిన రాధే… నిర్మాతలకు భారీ నష్టాలనే మిగిల్చిందట. ఈ సినిమా రిలీజ్‌కు ముందే వియ్‌ ఆర్‌ రెడీ ఫర్‌ ది లాసెస్‌ అంటూ క్లియర్‌గా చెప్పారు సల్మాన్‌ ఖాన్. అయితే నష్టాలు వస్తాయని తెలుసుగానీ ఈ రేంజ్‌లో ఉంటాయని ఎవరూ ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. ఓటీటీలో ఈ సినిమాకు భారీ డీల్‌ సెట్‌ అయినట్టుగా ప్రచారం జరిగింది. అయితే అంత భారీ డీల్‌ వచ్చినా.. రాధే నష్టాలు వంద కోట్లు దాటాయన్న టాక్ వినిపిస్తోంది. దిశాపటానీ హీరోయిన్‌గా నటించిన రాధే మూవీలో డ్రగ్ మాఫియాను కంట్రోల్ చేసి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు సల్మాన్‌. డైరెక్టర్‌గా సల్మాన్‌తో ప్రభుదేవాకు ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో వీళ్ల కాంబోలో పోకిరీ రీమేక్ వాంటెడ్, దబ్బంగ్3 వచ్చాయి. మాస్ యాక్షన్‌తో సల్మాన్ ఫ్యాన్స్ సాటిస్‌ఫై అయినా… జనరల్ ఆడియన్స్‌ మాత్రం ఈ మాస్ మసాలా మూవీకి అస్సలు కనెక్ట్ కాలేదు. దీంతో ఈద్‌కి బ్లాక్ బస్టర్ కొడతారనుకున్న బాయ్‌జాన్‌.. అభిమానులతో పాటు ఇండస్ట్రీని కూడా నిరాశపరిచారు.

పే ఫర్ వ్యూ కాన్సెప్ట్ వర్కవుట్‌ అయినా… పైరసీ ఎఫెక్ట్ రాధే మీద గట్టిగా పడింది. ఓటీటీలో రిలీజ్ అయిన గంటల్లోనే పైరసీ కావటంతో సల్మాన్‌ సినిమాకు భారీ లాస్ తప్పలేదు. రాధే రిలీజ్ అనుభవాలతో స్టార్ హీరోలు హైబ్రీడ్ రిలీజ్ అన్న కాన్సెప్ట్‌నే పక్కన పెట్టేశారు. అయితే అవుట్‌ రైట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసేయాలి.. లేదా థియేటర్లు ఓపెన్‌ చేసేవరకు వెయిట్ చేయాలి అని ఫిక్స్ అయిపోయారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

RadheShyam Movie Video: ‘రాధేశ్యామ్’ మూవీతో ప్రభాస్ మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడా ?

Aditi Rao Hydari : ఆ సినిమా ఓకే చేయడం నా కెరీర్‌లోనే డేరింగ్ డెసిషన్‌ అంటున్న అదితి..

Rashmika Mandanna : టాక్‌ ఆఫ్‌ ది సోషల్ మీడియాగా రష్మిక పెట్.. షూటింగ్ కు కూడా తీసుకెళ్తున్న ముద్దుగుమ్మ..