CBSE 10th Class result 2021: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు ఎప్పుడో తెలుసా..? మరింత క్లారిటీ ఇచ్చిన బోర్డు

CBSE Class 10 Result: కరోనా విజృంభణ నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 10, 12 వ తరగతి ఫలితాలను ప్రకటించేందుకు..

CBSE 10th Class result 2021: సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు ఎప్పుడో తెలుసా..? మరింత క్లారిటీ ఇచ్చిన బోర్డు
CBSE 10th Class result 2021
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 19, 2021 | 7:30 AM

CBSE Class 10 Result: కరోనా విజృంభణ నేపథ్యంలో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 10, 12 వ తరగతి ఫలితాలను ప్రకటించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే 12వ తరగతి పరీక్షల తుది ఫలితాల వెల్లడికి అనుసరించే మూల్యాంకన విధానాన్ని సీబీఎస్ఈ బోర్డు సుప్రీంకోర్టుకు సమర్పించింది. అంతేకాకుండా త్వ‌ర‌లోనే పదో తరగతి పరీక్షల ఫలితాలను సైతం వెల్ల‌డించనున్నట్లు సీబీఎస్ఈ బోర్డు పేర్కొంది. జులై 20 నాటికల్లా ఫ‌లితాల‌ను వెల్ల‌డించేలా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు బోర్టు శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు బోర్డు పరీక్షల కంట్రోలర్‌ సన్యం భరద్వాజ్‌ మాట్లాడుతూ.. జులై 20 న పదో తరగతి పరీక్షల ఫలితాలు, జులై 31 నాటికి 12వ తరగతి ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న విద్యార్థులు.. బోర్డు ఫలితాల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భ‌ర‌ద్వాజ్‌ చెప్పారు. వీలైనంత త్వరలో పదో తరగతి ఫలితాలు ప్రకటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అయితే.. వెల్లడించిన ఫలితాలతో ఎవరైనా విద్యార్థులు సంతృప్తి చెందకపోతే పరీక్ష రాసేందుకు వీలుగా రిజిస్ట్రేషన్‌ల‌ను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అనంతరం సమయానుకూలంగా పరీక్ష తేదీలను ప్రకటిస్తామని వెల్లడించారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగానే ఎగ్జామ్స్‌ నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని.. అందుకు తగినట్లుగా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా.. సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల ఫలితాలను ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఆధారంగా ప్రకటించనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను cbse.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. కాగా, గతేడాది జులై 15న ప‌ది ఫలితాలు విడుదలయ్యాయి.

Also Read:

Horoscope Today: ఈ రాశులవారు ఆరోగ్యం.. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ఈరోజు రాశిఫలాలు..

Milkha Singh : 80 రేసుల్లో 77 గెలిచిన మిల్కాసింగ్.. కానీ ఒలంపిక్ కల మాత్రం అలాగే మిగిలిపోయింది..