Telangana School Reopening: జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. తెలంగాణ స‌ర్కార్ నిర్ణ‌యం

రాష్ట్రంలో జూన్ 20 వ తేదీ నుంచి లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ తెలంగాణ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో విద్యాసంస్థల....

Telangana School Reopening: జూలై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం.. తెలంగాణ స‌ర్కార్ నిర్ణ‌యం
Telangana Schools
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 19, 2021 | 7:16 PM

రాష్ట్రంలో జూన్ 20 వ తేదీ నుంచి లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేస్తూ తెలంగాణ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో విద్యాసంస్థల పునఃప్రారంభంపై కూడా కేబినెట్ భేటీలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జులై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జూలై 1 నుంచి అన్ని రకాల విద్యాసంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారుల‌ను ఆదేశించింది. పూర్తిస్థాయి సన్నద్థతతో విద్యాసంస్థలను పునః ప్రారంభించాలని స్ఫష్టం చేసింది. ఆన్‌లైన్ విధానంలోనే స్కూళ్లు ప్రారంభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

ప్పటిలాగే అన్ని సర్వీసులు

కాగా  లాక్‌డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో… ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను కేబినెట్ ఆదేశించింది. ప్రభుత్వ కార్యాలయాలు, బస్సులు, మెట్రో సర్వీసులు అన్నీ ఎప్పటిలాగే నడవనున్నాయి.  ఇక అంతర్రాష్ట్ర ప్రయాణాలు, బస్సు సర్వీసుల విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉదయం వేళ ప్రయాణాలు కొనసాగుతుండటగా, తాజా నిర్ణయంతో రాత్రివేళ కూడా బస్సులు తిరగనున్నాయి. ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశంతోనే లాక్​డౌన్ ఎత్తివేశామని రాష్ట్ర మంత్రివర్గం తెలిపింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం అందించాలని కోరింది.

లాక్​డౌన్​ ఎప్పుడు ప్రారంభమైందంటే..

కరోనా వ్యాప్తి అధిక‌మ‌వ్వ‌డంతో మొద‌ట‌ మే 14 నుంచి 20 వరకు లాక్‌డౌన్ ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నాలుగు గంటల పాటు లాక్‌డౌన్ సడలింపు ఇవ్వగా… ఆ తర్వాత మే 21 నుంచి 31 వరకు మరోసారి లాక్‌డౌన్ పొడిగించారు. అయితే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఉండేలా గ‌వ‌ర్న‌మెంట్ నిర్ణ‌యం తీసుకుంది. అయితే జూన్‌లో మరోసారి లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి 10 వరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అనంతరం మరో పదిరోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించారు. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటలనుంచి 6 గంటల వరకు అంటే గంటపాటు తిరిగి ఎవరి గమ్యస్థానాలకు వారు చేరుకునేందుకు అనుమ‌తి ఇచ్చారు. అయితే తాజా కేబినెట్ సమావేశంలో పూర్తిగా ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Also Read:  తెలంగాణలో లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేత‌.. కీల‌క ఆదేశాలు జారీ చేసిన కేబినెట్

రూ.10 ల‌క్ష‌ల‌కే కేజీ బంగారం, త్వరపడ్డారో.. బిస్కెట్టే !

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ